BigTV English

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహంతో ఉన్నారా? వారు వ్యవహారిస్తున్న తీరుపై అసహనంగా ఉన్నారనే అనే చర్చ జోరుగా నడుస్తోందట. ఇటీవల పలు సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారడంతో పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తుందట. అసలింతకీ టీడీపీలో ఏం జరుగుతోంది?


అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చర్చలు

అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు రాజకీయంగా చర్చినీయంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో వారి తీరుపైన సీరియస్ అయిన సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా మంత్రివర్గ భేటీలో అధికారిక అజెండా తరువాత మరోసారి ఈ ప్రస్తావన తెచ్చారంట. ఈ సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల పైన మాట్లాడినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


ఎమ్మెల్యేలతో మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని సూచన

అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్‌చార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలని బాబు సూచించారట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. అసెంబ్లీ వేదికగా చిరంజీవిని ఉద్దేశిస్తూ .. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాద్దాంతానికి దారితీశాయి.

బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చిరంజీవి

దీంతో వెంటనే చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో తనకు అవమానం జరిగిందన్న బాలయ్య వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. అంతేకాదు.. జగన్ తనకు సాదరనంగా ఆహ్వానం పలికారని, గౌరవం ఇచ్చారని చెప్పారు. బాలయ్య కామెంట్స్ కు చిరు ఇచ్చిన వివరణ కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది. చిరంజీవి వ్యాఖ్యలు వైసీపీకి ప్లస్ అయ్యాయనే చర్చ నడిచింది. చిరంజీవి స్టేట్ మెంట్ ఆధారంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి.. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బాలయ్య వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం చంద్రబాబు సహా కూటమి నాయకుల్లో వ్యక్తమవుతోంది.

మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న కొందరు ఎమ్మెల్యేలు

బాలకృష్ణ వ్యాఖ్యలే కాదు.. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులను కార్నర్‌ చేస్తూ మాట్లాడం కూడా ఇబ్బందికరంగా మారిందనే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ కూడా ఇచ్చిన పరిస్ధితి ఉందని పార్టీ నేతలు చెబుతున్న మాట. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారట.

ఎమ్మెల్యేలు పార్టీ గీత దాటుతున్నారని అసహనం

ఇన్‌ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలి. వారు చేస్తున్న తప్పొప్పులను వారికి తెలియజేసి సరిచేయాలని మంత్రులకు సూచించారట. అప్పటికీ వినకుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారంట. ఇదంతా జిల్లా ఇన్‌చార్జి మంత్రులే బాధ్యతగా తీసుకోవాలని సీఎం చేప్పారట. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి మంత్రులు చూసుకోవాలని గట్టిగానే చెప్పారట. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారట. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ, రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గ నిర్దేశం చేయాలన్నారట.

Also Read: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

ప్రభుత్వం చేసే సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుందని సూచించారంట.. ప్రజలతో మమేకం కావడమే కాదు.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులు, నేతలు, కేడరే పార్టీకి ప్రతినిధులు.. పార్టీకి ప్రతినిధులలాంటి వారు తమ వ్యవహార శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని స్పష్టం చేశారంట. మరి ఇప్పుడైనా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు మారుతుందో లేదో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Huzurabad Politics: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Telangana BJP: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Big Stories

×