Kavya Shree (Source: Instragram)
కావ్య శ్రీ.. సీరియల్స్ చూసేవారికి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కర్ణాటక బెంగళూరుకి చెందిన ఈమె నీలి అనే కన్నడ సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించింది.
Kavya Shree (Source: Instragram)
ఆ తర్వాత నాయకి, మహాకాళి అనే మరో రెండు కన్నడ సీరియల్స్ లో నటించిన ఈమెకు.. 2019లో నిఖిల్ మలియక్కల్ తో కలసి గోరింటాకు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అలా తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు పరిచయమయ్యింది.
Kavya Shree (Source: Instragram)
ఈ సీరియల్ మంచి విజయం అవ్వడమే కాకుండా ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ జంటకు మంచి గుర్తింపు కూడా లభించింది. అయితే ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు.
Kavya Shree (Source: Instragram)
అయితే అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పుడు ట్రోఫీ తీసుకొని కచ్చితంగా కావ్య వద్దకు వెళ్లి క్షమాపణలు చెబుతానని, ఆమె తన భార్య అంటూ చెప్పి మళ్ళీ ఆమెను కలవనే లేదు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోయింది అని అందరూ నిర్ధారణకు వచ్చేశారు.
Kavya Shree (Source: Instragram)
అలా నిఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Kavya Shree (Source: Instragram)
ఇదిలా ఉండగా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కావ్య.. తాజాగా బ్లాక్ కలర్ చీరలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యావు నిఖిల్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే చీరకట్టులో కావ్య చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.