amritha_aiyer (Source: Instagram)
Amritha Aiyer Photos: హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, హనుమాన్ చిత్రాలతో గుర్తింపు పొందింది. రామ్ పోతినేని రెడ్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రి ఇచ్చింది ఈ భామ.
amritha_aiyer (Source: Instagram)
కానీ ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, హనుమాన్. ఇక హనుమాన్ మూవీతో తొలి కమర్షియల్ హిట్ కొట్టింది. కాగా ప్రదీప్ మాచిరాజు సరసన హీరోయిన్గా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా మ్యూజికల్‌గా హిట్ అయ్యింది.
amritha_aiyer (Source: Instagram)
కానీ, కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కాస్తా విరామం తీసుకుని ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హనుమాన్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
amritha_aiyer (Source: Instagram)
ఈ సినిమాతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో తెలుగులో ఆమె ఫుల్ బిజీ అయిపోతుందని అనుకున్నారు. కానీ, హనుమాన్ తర్వాత ఇప్పటివరకు మరో చిత్రం ప్రకటించలేదు. కానీ, ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది.
amritha_aiyer (Source: Instagram)
కానీ కొద్ది రోజులుగా అమృత సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది. దీంతో ఆమె అప్డేట్స్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా అంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
amritha_aiyer (Source: Instagram)
మళ్లీ వస్తున్నానంటూ అమృత పెట్టిన ఈ క్యాప్షన్ అంతర్యం ఏంటి? ఆమె తెలుగులో ఏదైనా కొత్త సినిమాకు సైన్ చేసిందా? లేదా సోషల్ మీడియా రీఎంట్రీ గురించి చెప్పిందా? ఫ్యాన్స్ ఆలోచన పడ్డారు. ఏదేమైన లాంగ్ గ్యాప్ తర్వాత అమృతను ఇలా చూడటంతో ఆమె ఫ్యాన్స్, ఫోలోవర్స్ ఖుష్ అవుతున్నారు.