Protein Shake: ఇంట్లోనే తయారు చేసుకునే ప్రోటీన్ షేక్ ఆరోగ్యం, కండరాల నిర్మాణం, బరువు నియంత్రణలో ఉండటం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మార్కెట్‌లో దొరికే కృత్రిమ ప్రొటీన్ పౌడర్‌ల కంటే ఇంట్లోనే ప్రొటీన్ షేక్ తయారు చేసుకుని తాగడం మంచిది. తర్వాత తక్షణ శక్తి కోసం లేదా బ్రేక్ ఫాస్ట్ సమయంలో దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. ఇంతకీ ఇన్ని ప్రయోజనాలు ఉన్న మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ..
ఇంట్లోనే.. ప్రొటీన్ షేక్ ఎలా తయారు చేయాలి ?
కావలసిన పదార్థాలు:
పాలు (లేదా పెరుగు): 1 కప్పు
అరటి పండు: 1
పల్లీ వెన్న : 1 టేబుల్ స్పూన్
గుప్పెడు ఓట్స్: 1/4 కప్పు
చియా సీడ్స్ : 1 టీస్పూన్
తేనె: కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా బ్లెండర్‌లో పాలు లేదా పెరుగు పోయండి.
అందులో అరటి పండు ముక్కలు, పల్లీ వెన్న, ఓట్స్, చియా సీడ్స్, తేనె కలపండి.
మిశ్రమం అంతా మెత్తగా, చిక్కగా అయ్యే వరకు (సుమారు 30 నుంచి 60 సెకన్లు) బ్లెండ్ చేయండి.
అవసరమైతే, మరింత పలుచగా చేయడానికి కొద్దిగా పాలు కూడా కలపొచ్చు. అంతే గ్లాసులో వేసి తాగండి.
గమనికలు:
సమయం: వ్యాయామం చేసిన తర్వాత 30 నిమిషాల లోపు ఈ షేక్‌ను తీసుకోవడం వల్ల కండరాల మరమ్మత్తు త్వరగా జరుగుతుంది.
నాణ్యత: ఎక్కువ పోషకాలు పొందడానికి, దేశీయ, సహజమైన పల్లీ వెన్నను (అధిక చక్కెర లేనిది) వాడండి.
ఇంట్లో తయారు చేసిన ఈ సహజ ప్రొటీన్ షేక్‌తో మీరు మీ ఆహారపు అలవాట్లలో ఆరోగ్యకరమైన మార్పును తేగలరు.