Hollywood actor Death: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతుంటే.. మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటు ఇండియన్ సినీ సెలబ్రిటీలే కాదు.. అటు గత రెండు వారాలుగా హాలీవుడ్ నటుల మరణాలు కూడా సినీ ప్రేమికులను విషాదంలోకి నెట్టి వేస్తున్నాయని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు మరో హాలీవుడ్ హీరో కన్నుమూశారు. ‘ఆర్కో’ నిర్మాత, సినీ నటుడు పీటర్ హెన్రీ స్క్రోడర్ (Peter-Henry Schroeder)ఫ్లోరిడాలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. స్టార్ ట్రెక్ లో క్లింగాన్ గా గుర్తింపు పొందిన ఈయన కొరియా యుద్ధంలో సైనికుడిగా కూడా సేవలు అందించారు. స్ట్రీప్, అలాన్ ఆల్బాతో నటించిన ఈయన చివరి వరకు నటనను కొనసాగించారు. లాస్ ఏంజిల్స్ లోని సైనిక లాంఛనాలతో ఈయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇకపోతే వయసు మీద పడడంతోనే ఆయన మరణించినట్లు సమాచారం.