Big Stories

MBRSC:- చంద్రుడిపై కాలు పెట్టే అనుభూతి.. అందరికీ ఉచితంగా..

MBRSC:- ప్రస్తుతం చాలావరకు స్పేస్ సైంటిస్టుల దృష్టి అంతా చంద్రుడిపైనే ఉంది. చంద్రుడిపై మరెన్నో ప్రయోగాలు చేయాలని, దానిపై నేలను అభివృద్ధి చేసి కట్టడాలను చేపట్టాలని.. ఇలా మరెన్నో ఆలోచనలతో ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే దుబాయ్‌కు చెందిన స్పేస్ ఆర్గనైజేషన్ చేసిన ఒక పరిశోధన అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందరికీ మూన్‌పై అడుగుపెట్టే అనుభూతిని అందిస్తోంది.

- Advertisement -

దుబాయ్‌కు చెందిన మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎమ్బీఆర్ఎస్సీ) త్వరలోనే చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి రషీద్ రోవర్ అనే ఒక వాహనాన్ని సిద్ధం చేసింది. త్వరలోనే ఇది చంద్రుడిపై కాలు కూడా పెట్టనుంది. ఇదే సమయంలో రషీద్ రోవర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభూతిని ప్రజలకు అందిస్తోంది. దీని ద్వారా ఎవరైనా వర్చువల్ రియాలిటీ ద్వారా చంద్రుడి మీద కాలు పెట్టినట్టు ఫీల్ అవ్వచ్చు.

- Advertisement -

ఈ ఏఆర్ ద్వారా రషీద్ రోవర్‌లో కూర్చొని చంద్రుడిపై ప్రయాణిస్తున్నట్టు అనుభూతి చెందవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్ని వయస్సుగలవారికి చంద్రుడిపై కాలు పెడితే ఎలా ఉంటుంది, చంద్రుడిపై నేల ఉంటుంది అని రషీద్ రోవర్ ద్వారా తెలియజేయాలి అనుకోవడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. చిన్న వయసువారికి ఇది స్ఫూర్తిని ఇవ్వాలని, వారికి స్పేస్, సైన్స్, టెక్నాలజీ ఆసక్తి కలిగేలా చేయడానికి ఇది వారి ప్రయత్నమని అన్నారు.

రషీద్ రోవర్ ఏఆర్ ఇంగ్లీష్‌లో, అరబిక్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటుందని, ఈ ఎక్స్‌పీరియన్స్ స్మార్ట్ ఫోన్లలోని ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఫ్రీగా దొరుకుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ ఏఆర్ ద్వారా రషీద్ రోవర్ ఎలా పనిచేస్తుంది, భవిష్యత్తులో దీని వల్ల ఎలాంటి ప్రయోగాలు జరగనున్నాయని లాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఏఆర్ కోసం రోవర్‌కు సంబంధించిన 3డి మోడల్స్ సిద్ధం చేశామని, చంద్రుడిపై నేలను కూడా కొంచెం మార్చామని తెలిపారు.

యాప్ అవసరం లేకుండానే ఈ ఏఆర్‌ను అనుభూతి చెందవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే రషీద్ రోవర్‌ను చంద్రుడిపైకి పంపడం కోసం ముందుగా ఏప్రిల్ 25న ముహూర్తం ఫిక్స్ చేసింది ఎమ్బీఆర్ఎస్సీ. ఒకవేళ ఆ తేదీన కుదరకపోతే ఏప్రిల్ 26, మే 1, మే 3 తేదీలను ప్రత్యామ్నాయంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ రోవర్ జపాన్‌లో సురక్షితంగా స్టోర్ అయ్యి ఉంది. ఇది 14.75 రోజుల పాటు చంద్రుడిపైనే ఉండి ప్రయోగాలు చేయనుంది. అంటే ఇది ఒక ల్యూనార్ డేతో సమానం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News