BigTV English

RCB vs CSK Match Updates: అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్టే..

RCB vs CSK Match Updates: అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్టే..

Bengaluru Weather Updates Ahead Of RCB CSK Clash IPL 2024: చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య బెంగళూరులో నేడు జరగనున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం అని వారం రోజుల నుంచి ఊదరగొడుతున్నారు. కానీ  శనివారం అంటే నేడు మ్యాచ్ జరిగే రోజు చూస్తే ఉదయం నుంచి ఎండకాసిందని, సాయంత్రం కూడా వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.


బెంగళూరులో వాతావరణం పొడిగా ఉందని వర్షాభావ పరిస్థితులు లేవని మ్యాచ్‌కు అనుకూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. దీంతో ఆర్సీబీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని ఆర్సీబీ కసి మీద కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్సీబీ వరుసగా 5 మ్యాచులు గెలిచి మంచి ఊపుమీదుంది. ఇదే ఊపులో చివరి లీగ్ మ్యాచ్ గెలిచి రాజసంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలని తహతహలాడుతోంది.

మరోవైపు చెన్నయ్ కి అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ గెలుపు, ఓటమిలను పక్కన పెట్టి ఒకవేళ చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి వెళుతుంది. ఓడితే మాత్రం నెట్ రన్ రేట్ ఆధారం అవుతుంది. అది కూడా ఆర్సీబీకన్నా ఎక్కువ ఉండటం వల్ల, రిస్క్ అటువైపే ఉంది. ఇవన్నీ కాకుండా మొత్తానికి మ్యాచ్ రద్దయిపోతే చెరో పాయింట్ వస్తుంది కాబట్టి, హైదరాబాద్ తరహాలో 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కి చేరిపోతుంది.


ఇన్నీ సమీకరణాల మధ్య వరుణుడు పెట్టే టెన్షన్ అయితే మామూలుగా లేదు. కాకపోతే చెన్నై కూల్ గానే ఉంది. ఎటొచ్చి ఆర్సీబీ కి మాత్రం హై ఓల్టేజ్ మ్యాచ్ లా మారింది. ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కూడా తన రిైటర్మెంట్ పై మాట్లాడుతున్నాడు. రిటైర్ అయ్యేలోపు ఐపీఎల్ లో ఆర్సీబీకి ట్రోఫీ అందించాలని ఆశపడుతున్నాడు. మరి నేడు వర్షం తగ్గి, చెన్నై పై నెట్ రన్ రేట్ తో సహా గెలిచి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాలని, కోహ్లీ కోరిక నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×