BigTV English

Nirmala Sitharaman slams Kejriwal: ఆ సంఘటన నన్ను షాక్‌కు గురిచేసింది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman slams Kejriwal: ఆ సంఘటన నన్ను షాక్‌కు గురిచేసింది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Central Minister Nirmala Sitharaman Comments on Kejriwal: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ పై దాడి ఘటన విషయమై ఆమె స్పందించారు. ఈ విషయమై కేజ్రీవాల్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.


కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎంపీపై దాడి జరిగితే వెంటనే స్పందించాల్సిన ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం తనను షాక్ కు గురిచేస్తోందని ఆమె అన్నారు. మహిళా కమిషన్ కు చైర్ పర్సన్ గా పనిచేసిన ఆమెకు అలాంటి పరిస్థితి ఎదురవడం దారణమన్నారు. ఆ ఘటనపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, యూపీ పర్యటనలో ఆయన వెంట నిందితుడు ఉన్నట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా సదరు ఎంపీ ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే ఆమెపై ఒత్తడి ఉందని తనకు అనిపిస్తున్నదని ఆమె అన్నారు.

అదేవిధంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి కూడా స్పందించారు. స్వాతి మాలీవాల్ పై దాడి నేపథ్యంలో స్పందిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని, అయితే, తనకు కూడా గతంలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ‘ స్వాతిపై దాడి జరిగింది. ఆ పార్టీలో కొట్టడం మామూలే. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ కుమార్ లాంటివాళ్లను బౌన్సర్లతో గెంటేశారు. అయితే, ఈసారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టించడం సబబేనా? ఇంత జరిగినంకా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడం సరికాదు. వెంటనే ఆయన క్షమాపలు చెబుతూ ఆ పదవికి రాజీనామా చేయాలి’ అంటూ షాజియా ఇల్మి డిమాండ్ చేశారు.


అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బిభవ్ కుమార్ విచారణకు గైర్వాహాజరు కావడంతో ఆయనకు నోటీసులిచ్చేందుకు ఎన్ సీడబ్ల్యూ బృందం పోలీసులతో కలిసి బిభవ్ కుమార్ ఇంటికి వెళ్లినట్లు కమిషన్ చైర్ పర్సన్ వెల్లడించారు. అయితే, ఆ ఇంట్లోని వ్యక్తులెవరూ కూడా ఆ నోటీసులను తీసుకునేందుకు నిరాకరించారని, దీంతో ఆ ఇంటి ద్వారానికి నోటీసులు అతికించారని పేర్కొన్నారు. అయితే, విచారణ శనివారం చేపడతామని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, మాలీవాల్ పై దాడి కేసు విషయమై ఢిల్లీ పోలీసులు ఘటన చోటు చేసుకున్న సీఎం కేజ్రీవాల్ ఇంటికి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అనంతరం ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. పలువురు భద్రతా సిబ్బంది వాంగ్మాలూలను రికార్డు చేసుకున్నారు. పోలీసులు వారి వెంట ఎంపీ స్వాతి మాలీవాల్ ను కూడా తీసుకెళ్లారు.

Also Read: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

దాటి ఘటనకు సంబంధించి పున:సృష్టి చేసేందుకు పోలీసులు తమ వెంట మాలీవాల్ ను కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా తీసుకెళ్లారు. మరోవైపు ఇంకో పోలీస్ బృందం బిభవ్ కుమార్ విచారించేందుకు అతని ఇంటికి కూడా వెళ్లిందని ఓ అధికారి పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×