BigTV English

Renu Desai: నాకున్నంత ప్రేమ.. పవన్ కు లేదు.. అందుకే..

Renu Desai: నాకున్నంత ప్రేమ.. పవన్ కు లేదు.. అందుకే..

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఏపీ ఎన్నికల కారణంగా బ్రేక్ తీసుకున్న పవన్ రిజల్ట్స్ వచ్చేవరకు సెట్స్ లో అడుగుపెట్టడు. పవన్ సినిమాల విషయం, రాజకీయాలు విషయం పక్కన పెడితే.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. కింద కామెంట్స్ లో వదినా అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేస్తూ ఉంటారు.


అసలు పోస్ట్ ఏంటి.. ? ఆమె దేని గురించి పెట్టిందో కూడా చూడకుండా.. కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇక దీనికి రేణు చాలాసార్లు వారిపై ఫైర్ అయ్యింది. ఎంతోమందిని బ్లాక్ చేసింది. అయినా కూడా ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి రేణు.. పవన్ అభిమానిపై ఫైర్ అయ్యింది. గత కొన్నిరోజులుగా రేణు.. యానిమల్స్ అడాప్షన్ కార్యక్రమం చేస్తున్న విషయం తెల్సిందే. కుక్కలు, పిల్లులను ఎవరైనా పెంచుకోవాలన్నా.. లేక వాటి సంరక్షణకు డబ్బు అందజేయాలన్నా చేయవచ్చని కొన్ని ఎన్జీవోస్ తో కలిసి పనిచేస్తుంది. దీంతో ఆమె చేస్తున్న మంచి పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.


తాజాగా ఒక అభిమాని మాత్రం రేణును పవన్ తో పోల్చాడు. మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా బంగారం లాంటి మనసు వదినది అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ పై రేణు ఫైర్ అయ్యింది. ” మీలో కొంత మంది నేను చేసే ప్రతి పోస్ట్‌ను ఎప్పుడూ నా మాజీ భర్తతో ఎందుకు పోలుస్తున్నారు? నేను ఇప్పటికి వందల కొద్దీ అకౌంట్స్ ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటాను. నేను ఒక మనిషిని.. ఇది నా అకౌంట్.. నేను 10 సంవత్సరాల వయస్సు నుండి జంతువులను రక్షించడం చేస్తున్నాను, దీనికి నా మాజీ భర్తతో ఎటువంటి సంబంధం లేదు. నా ప్రతి ఒక్క పోస్ట్‌పై వ్యాఖ్యానించడం మానేయమని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. ఎందుకంటే నేను జంతువులను ప్రేమించినట్లు ఆయన ప్రేమించడు.. కేర్ తీసుకోడు” అంటూ చెప్పింది.

అంతే కాకుండా.. “ఈ సమాధానం కోపంతో కాదు గాఢంగా గాయపడిన మనసు నుంచి వస్తుంది. సంవత్సరాల నుండి నేను నా స్వంతంగా ఏదైనా చేస్తే ట్రోల్ చేస్తున్నారు.. లేదా నా మాజీ భర్తతో పోలుస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి సమస్య లేదు. కానీ దయచేసి నా ఇన్‌స్టాగ్రామ్ నాది మాత్రమేనని అతని అనుచరులను అభ్యర్థిస్తున్నాను” అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×