iPhone 16 Pro Max: ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త సిరీస్ లాంచ్ అవుతుందంటే ఫోన్ ప్రియులు ఎగబడి కొనేందుకు ఆసక్తిగా ఉంటారు. అయితే ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 15 సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఐఫోన్ 16 మార్కెట్‌లో వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న సిరీస్. ఇది ఏడాది చివరి నాటికి లాంచ్ చేయబడుతుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కి సంబంధించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరొక వార్త ఐఫోన్ ప్రియులను ఫుల్ ఖుష్ చేసింది. లాంచ్‌కు ముందే ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దాని డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరాలో అప్‌డేట్‌లు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. మరి ఆ లీక్ అయిన ఫొటోల లుక్, మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టెక్ లీక్‌స్టర్ డేనియల్ అనే వ్యక్తి ఐఫోన్ 16 ప్రో మాక్స్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దానిని ఐఫోన్ 15 ప్రో మాక్స్‌తో పోల్చారు. తద్వారా ఈసారి ఐఫోన్ మోడల్‌లో ఏ తేడాను చూడబోతున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Also Read: అదిరిపోతున్న ఐఫోన్ 16 ఫీచర్లు.. 15ను మించిపోయింది బాసూ!
ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంటే స్క్రీన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ కంటే 0.2 మిమీ పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే అసలు డిస్‌ప్లే పరిమాణం, డిస్‌ప్లే రిజల్యూషన్, ఇతర వివరాలను నిర్ధారించలేదు. రాబోయే ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్ బాడీ ఐఫోన్ 15 ప్రో మాక్స్ మాదిరిగానే టైటానియం అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్ 16 సిరీస్‌లో వేరే కెమెరా ప్లేస్‌మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే లీకైన ఫొటోలు చూస్తే.. ప్రో మాక్స్ మోడల్ iPhone 15 Pro Max మాదిరిగానే కనిపిస్తుంది.
Apple iPhone 16 లైనప్ కోసం కొత్త A-సిరీస్ చిప్‌లను డిజైన్ చేస్తుందని భావిస్తున్నారు. ఇది తాజా N3E 3-నానోమీటర్ నోడ్‌లో తయారు చేయబడుతుంది. iPhone 16, iPhone 16 Proలో వేర్వేరు చిప్‌లను ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. అధిక-స్థాయి చిప్ ప్రో మోడల్‌కు పరిమితం చేయబడుతుందని సమాచారం.
iPhone 16 Pro Max vs iPhone 15 Pro Max: pic.twitter.com/gbCOnQf3mA
— Daniel (@ZONEofTECH) May 10, 2024
ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు పరిమితం చేయబడిన యాక్షన్ బటన్.. రాబోయే అన్ని ఐఫోన్ 16 మోడళ్లలో కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. ఇది కాకుండా.. ఈసారి కొత్త ‘క్యాప్చర్ బటన్’ కూడా కనిపిస్తుందట. దీని ప్లేస్‌మెంట్ పవర్ బటన్ క్రింద ఉంటుందని చెప్తున్నారు. దీని ద్వారా ఇది ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగించబడుతుందని టెక్ నిపుణుల అంచనా. క్యాప్చర్ బటన్ డిజిటల్ కెమెరాలోని షట్టర్ బటన్ లాగా పని చేస్తుందట. కెమెరాకు సంబంధించి.. బేస్ మోడల్ iPhone 16, 16 Pro Max, iPhone 15 Pro మోడల్‌లో అందుబాటులో ఉన్న 12MP అల్ట్రా-వైడ్ కెమెరా నుండి 48MP అల్ట్రా-వైడ్ కెమెరాను పొందవచ్చు.
Also Read: ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తుంది.. 58,000 రూపాయలకే!
అయితే అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో వేడెక్కడం అనేది ఒక ప్రధాన సమస్య. అయితే ఐఫోన్ 16 మోడల్‌లతో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొందరు అనుకుంటున్నారు. ఐఫోన్ 16 మోడల్‌లు వేడెక్కెటప్పుడు దానిని ఎదుర్కోవడానికి కొత్త థర్మల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయని సమాచారం. Apple iPhone 16 మోడల్‌ల కోసం గ్రాఫేన్ థర్మల్ సిస్టమ్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా iPhone 16 Pro మోడల్‌లలో వేడిని తగ్గించే మెటల్ బ్యాటరీ కోటింగ్ కూడా ఉండవచ్చని సమాచారం. ఇక ఈ iPhone 16 Pro Max ధర విషయానికొస్తే.. సుమారు రూ.1,70,000 వరకు ఉండవచ్చని అంటున్నారు.