Lok Sabha Elections 2024 5th Phase Polling Campaigning Ends: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత ఎన్నికలకు ఈ సాయంత్రం ప్రచారం ముగిసింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మే 20న జరగనున్న ఐదో దశలో బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, జమ్మూ & కాశ్మీర్, లడఖ్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ, ల,క్నో కైసర్‌గంజ్; బీహార్‌లోని హాజీపూర్, సరన్; మహారాష్ట్రలోని ముంబై నార్త్, ముంబై నార్త్-వెస్ట్, ముంబై నార్త్-ఈస్ట్, ముంబై నార్త్-సెంట్రల్, ముంబై సౌత్, ముంబై సౌత్-సెంట్రల్, కళ్యాణ్ నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది.
Also Read: బరేలీ బరిలో రాహుల్.. నామినేషన్ దాఖలు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలి బరిలో నిలవగా, అమేథీ బరిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ నుంచి రెండో సారి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నో బరిలో నిలిచారు. చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు.