Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణ సమయ వేళల్లో మార్పులు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించినట్లు సమాచారం. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారని తెలుస్తోంది. యథావిథిగానే మెట్రో రైలు రాకపోకలు కొనసాగుతాయని, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, అదేవిధంగా ప్రతి సోమవారం వారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకల విషయమై పరిశీలన మాత్రమే జరిగిందని.. కానీ, ఇంకా ఆ సమయవేళల్లో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని.. అయితే, ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాల విషయమై పరిశీలన చేస్తున్నట్లు వారు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులెవరూ కూడా మెట్రో రైళ్ల సమయ వేళల విషయమై అయోమయానికి గురికావొద్దని, యథావిధిగానే నిర్ధిష్ట సమయానికి మెట్రో రైళ్ల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నట్లు సమాచారం.