BigTV English

Samsung Galaxy F55 5G: గెలాక్సీ ఎఫ్ 55 లాంచ్ వాయిదా.. కొత్త డేట్, ధర, స్పెసిఫికేషన్

Samsung Galaxy F55 5G: గెలాక్సీ ఎఫ్ 55 లాంచ్ వాయిదా.. కొత్త డేట్, ధర, స్పెసిఫికేషన్

Samsung Galaxy F55 5G Launch Postponed for May 27: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్ భారతదేశంలో తన రాబోయే కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మే 17న లాంచ్ చేస్తున్నట్లు ఇది వరకే వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ లాంచ్‌ను మే 27కి వాయిదా వేసింది. Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ వెగన్ లెదర్ బ్యాక్, మెరుగైన కెమెరాలు, కొత్త చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇది భారీ 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును పొందుతుంది.


Samsung Galaxy F55 5G India price

Samsung Galaxy F55 5G 12GB RAM + 256GB వేరియంట్‌ RS 30,000 లోపు ధరలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆరెంజ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, భాగస్వామ్య రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడుతుంది.


Samsung Galaxy F55 5G Specifications:

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ పెద్ద అప్‌గ్రేడ్‌తో వస్తుంది. ఇది వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. FHD+ రిజల్యూషన్‌తో భారీ 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పంచ్-హోల్ స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది. మృదువైన స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీని ఆదా చేయడానికి, సమయం, అలెర్ట్‌లను చూపించడానికి ఆల్వేస్-ఆన్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Also Read: మోడ్రన్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో సామ్‌సంగ్ నుంచి చీపెస్ట్ ఫోన్!

ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌ సిస్టమ్‌ను ప్రదర్శిస్తుంది. ప్రధాన లెన్స్‌కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంటుంది. ఫోన్ ముందువైపు సెల్ఫీల కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఫోన్ ముందు – వెనుక కెమెరాలు రెండూ 4K వీడియోలను చిత్రీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Samsung ఫోన్‌ను పవర్ చేయడానికి Qualcomm చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అడ్రినో GPUతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB RAM / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు వస్తుంది. ఇది ఎక్స్‌పెండెడ్ స్టోరేజ్ విస్తరించదగిన స్లాట్‌ను కలిగి ఉండవచ్చు. 5,000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అమర్చబడి ఉంటుంది. ఇది పైన వన్ UI 6.1తో ఆండ్రాయిడ్ 14 OSలో బూట్ అవుతుంది. అందువల్ల ఈ ఫోన్‌ను కొనుక్కోవాలని ఎంతగానో ఎదురుచూస్తున్నవారు మే 27 వరకు ఆగాల్సిందే.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×