BigTV English

News SPs appointed: ఏపీలో ఆ 3 జిల్లాలకు కొత్త పోలీస్ బాస్‌లు..

News SPs appointed: ఏపీలో ఆ 3 జిల్లాలకు కొత్త పోలీస్ బాస్‌లు..

Appointment of SPs in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన మూడు జిల్లాల ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ ను నియమించింది ఎన్నికల సంఘం.


ఎన్నికల అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు జిల్లాల ఎస్పీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి స్థానంలో కొత్త ఎస్పీలను నియమించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. వెంటనే వారు పదవీ బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. అయితే, ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్ గా లత్కర్ శ్రీకేష్ బాలాజీని కూడా నియమించింది. తాజాగా ఈ మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు, పోలింగ్ మరుసటి రోజు పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. అనంతరం హింసాత్మక సంఘటనలకు సంబంధించి వివరణ ఇచ్చారు.


ఆ తరువాత అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వారిని వెంటనే విధుల నుంచి తొలగించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను కూడా బదిలీ చేసింది. తాజాగా వారి స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ ను, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్ ను నియమించింది.

కాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, మాచర్లతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా పలు ప్రాంతాల్లో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Also Read: లండన్‌లో సీఎం జగన్, కాకపోతే..

ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వారి ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలతోపాటు అదనపు కేంద్ర బలగాలను రప్పించి ఆ ప్రాంతాల్లో భారీగా మోహరించాయి. అదేవిధంగా స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×