పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమాగా రూపొందనున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను చేసిన నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన రోజు నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.ఈ సినిమాకు ఓజీ (OG) అనే టైటిల్‌ను పెట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పోస్టర్ మీద జపనీస్ లాంగ్వేజ్ కూడా ఉండటంతో క్రేజ్ పెరిగిపోతుంది. దీన్నొక గ్యాంగ్ స్టర్ మూవీ అని అందరూ అనుకున్నారు.
గ్యాంగ్‌స్టర్ మూవీ అంటే సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్లా అలరిస్తుందని అందరూ భావించారు. కానీ.. అందులో నిజం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫైట్స్, పాటలు ఉండబోవంటూ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో పాటలు, ఫైట్స్ ఉండవంటే అది ఫ్యాన్స్‌ని మెప్పిస్తుందా? అనేది అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీతో పవన్ కళ్యాణ్ ఏవిధంగా మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
- Ram Charan: మా నాన్న జోలికి వస్తే ఊరుకోను: రామ్ చరణ్
- Tamannaah: తమన్నా – విజయ్ వర్మ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!