BigTV English

Raju Yadav Movie Trailer: గెటప్ శ్రీను పొలంలో మొలకలొచ్చాయి..లిప్ కిస్ పెట్టిసిన హీరోయిన్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

Raju Yadav Movie Trailer: గెటప్ శ్రీను పొలంలో మొలకలొచ్చాయి..లిప్ కిస్ పెట్టిసిన హీరోయిన్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

Getup Srinu’s Raju Yadav Movie Trailer: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడంతా క్యారెక్టర్ ఆర్టిస్టులదే హవా నడుస్తోంది. ఓ వైపు కామెడీ షోలలో.. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ.. మరోవైపు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటులు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఒక్క సారిగా హీరోగా ప్రమోషన్ పొంది మంచి హిట్లు అందుకున్నారు. అందులో సుహాస్, వైవా హర్ష, ప్రియదర్శి, సుడిగాలి సుధీర్‌తో సహా మరికొంత మంది ఉన్నారు.


ఇప్పుడు ఇదే కోవలోకి మరొకరు వచ్చి చేరారు. అతడే గెటప్ శ్రీను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మందిని కుడుపుబ్బా నవ్వించిన గెటప్ శ్రీను.. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసి సినీ ప్రియుల్ని ఎంతగానో అలరించాడు. ఇటీవలే ‘హనుమాన్’ మూవీలో హీరో తేజా సజ్జాకు ఫ్రెండ్ రోల్ చేసి తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి నేరుగా హీరోగా ప్రమోషన్ పొందాడు. ఇందులో భాగంగానే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. గెటప్ శ్రీను హీరోగా చేస్తున్న కొత్త సినిమా ‘రాజు యాదవ్’. డైరెక్టర్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ఫేమస్ సింగర్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లో ఆకతాయి పనికి అంతా షాక్..!


సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ రెస్పాన్స్‌ను బేస్ చేసుకుని మూవీ మేకర్స్ తాజాగా మరో అప్డేట్‌ను అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

రాజు యాదవ్ లైఫ్‌లోని విషాదానికి దారితీసిన సంఘటనతో ట్రైలర్ స్టార్ట్ అయింది. అందులో క్రికెట్ ఆడుతున్న సమయంలో రాజు యాదవ్‌కి బాలు తగలడంతో తన ముఖం కండరాలు దెబ్బతింటాయి. దీంతో అతడు తన ముఖాన్ని కదల్చలేడు. దీని కారణంగానే అతడి ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. అయితే ఆ ఫేసే అతడికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది.

Also Read: Sunidhi Chauhan: ఫేమస్ సింగర్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లో ఆకతాయి పనికి అంతా షాక్..!

ఇక ఇదంతా ఒకెత్తయితే.. ఆ ట్రైలర్‌లో లిప్ లాక్ సీన్ కూడా అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏంటి గెటప్ శ్రీను లిప్ లాక్ సీన్ వరకు వచ్చేశాడా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో గెటప్ శ్రీనుకి జోడీగా అంకితా ఖరత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ మే 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమా గెటప్ శ్రీనుకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×