E-Paper
Advertisement

Hi Nanna: అంతర్జాతీయ స్థాయిలో ‘హాయ్ నాన్న’కి అరుదైన ఘనత.. ఈ సారి ఏకంగా

Hi Nanna: అంతర్జాతీయ స్థాయిలో ‘హాయ్ నాన్న’కి అరుదైన ఘనత.. ఈ సారి ఏకంగా
Advertisement

Hi Nanna – Swedish International Film Festival 2024: కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అందులో జీవించేయడం నానికి వెన్నతో పెట్టిన విద్య. అయితే గతేడాది కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో ‘దసరా’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గతేడాది చివర్లో మరో కొత్త డైరెక్టర్ శౌర్యవ్‌తో ‘హాయ్ నాన్న’ మూవీతో వచ్చి మరొక ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ హాయ్ నాన్న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు కొత్తవాడే అయినా.. తన ఆలోచనా విధానంతో ఆడియన్స్‌ పల్స్‌ను పసిగట్టి థియేటర్లకు పరుగులు పెట్టించడంలో సక్సెస్ పొందాడు. దీంతో ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తండ్రి కూతుళ్ల బంధంతో కాస్త లవ్‌ను యాడ్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ఎంతో మంది ప్రేక్షకుల్ని ఏడిపించేసింది.

Advertisement

ఇందులో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో కుర్రకారు మనస్సును దోచుకుంది. ఆమె యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన అబ్దుల్ వాహబ్.. తన పాటలతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినీ ప్రియులు మరో లోకానికి వెళ్లినంత ఫీలింగ్ కలిగింది.

Also Read: అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న హవా.. ఏకంగా 11 విభాగాల్లో..

Advertisement

తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు అందించాలంటే నాని తర్వాతే ఎవరైనా. నాని సినిమా వస్తుందంటే.. పెద్ద హడావుడి ఉండదు. సైలెంట్‌గా వచ్చి.. బ్లాక్ బస్టర్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక హాయ్ నాన్న సినిమా కూడా తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కింది. బాక్సాఫీసు వద్ద మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా రూ.76 కోట్ల వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ అనంతరం ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంది. అలాంటి ఈ మూవీకి తాజాగా అరుదైన ఘనత లభించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ చిత్రం తాజాగా మరికొన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న చిత్రానికి వరుస అవార్డులు వరించాయి. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2024లో ఈ మూవీ ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహబ్‌కు మూడు అవార్డులు వరించాయి. డైరెక్టర్ శౌర్యువ్‌కు రెండు అవార్డులు.. అలాగే నాని- మృణాల్ ఠాకూర్‌కు ఓ అవార్డు లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×