Big Stories

Bus Accident : శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రమాదం.. రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

Bus Accident: శ్రీశైలం డ్యామ్ వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్‌ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్‌రోడ్‌ రక్షణ గోడను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ గోడ ధ్వంసమైంది. అయితే ఇనుప బారికేడ్‌ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది.

- Advertisement -

పెనుప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఘూట్ రోడ్డు రక్షణగోడను ఢీకొట్టగానే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని వెంటనే బస్సు నుంచి కిందకు దిగిపోయారు. శ్రీశైలం జలాశయానికి ఇరువైపులా ఉన్న ఘాట్‌రోడ్‌ మలుపుల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయి. ఇనుప బారికేడ్‌ ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

- Advertisement -

ఘాట్ రోడ్డు రక్షణ గోడలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వాహనాలు వేగంగా వెళ్లకుండా డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఈ ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బస్సులాంటి పెద్ద వాహనాలు ఘాట్ రోడ్డు గూండా ప్రయాణం ఓ సాహసం మారుతోంది. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కార్లు లాంటి వాహనాలు పరిమిత వేగంతో వెళ్లాలని తాజా ప్రమాదం హెచ్చరిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News