Big Stories

MI vs SRH IPL 2024 Preview: ముంబై పరువు నిలబెట్టుకుంటుందా? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్

Mumbai Indians vs Sunrisers Hyderabad Dream11 IPL 2024 Prediction: అతిరథ మహారథులు ఉన్న ముంబై జట్టు ఐపీఎల్ సీజన్ 2024లో అనామక జట్టుగా మారిపోయింది. ఐదుసార్లు కప్ కొట్టిన జట్టు ఇదేనా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముంబై జట్టు మెంటర్ సచిన్ టెండుల్కర్ స్టాండ్స్ లో ఉండి ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ సన్  రైజర్స్ మధ్య వాంఖేడీ స్టేడియంలో రాత్రి 7.30 కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ముంబై 11 మ్యాచ్ లు ఆడి 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.
హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం 4వ స్థానంలో ఉండి, ప్లే ఆఫ్ లో స్థిరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

- Advertisement -

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్ లు జరిగాయి. హైదరాబాద్ 10 సార్లు, ముంబై 12 సార్లు విజయం సాధించింది.

Also Read: కోల్ కతా నెంబర్ వన్ .. లక్నో ఘోర పరాజయం

కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు ముంబై ఇండియన్స్ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధానంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటా విఫలమవుతోంది. ఒక మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేసినా సరే, మ్యాచ్ గెలవకపోవడం చూస్తుంటే, జట్టు ఎంత వెనుకపడిందో అర్థమవుతోంది. మొదట కెప్టెన్సీ మార్పును ఎవరూ అంగీకరించడం లేదు.అలాగే హార్దిక్ పాండ్యా కూడా వీరితో కలవలేకపోతున్నాడు. తన ధోరణిలో తను వెళుతున్నాడు. ఇంత జరుగుతున్నా ఫ్రాంచైజీ కూడా కిమ్మనడం లేదు. ఇంతమంది మొండివాళ్లు ఉండటం వల్ల ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

హైదరాబాద్ సన్ రైజర్స్ మొత్తానికి పట్టాలెక్కింది. అయినా నమ్మకం లేదు. రాజస్థాన్, కోల్ కతా జట్ల తరహాలో నమ్మకంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. గెలిస్తే వరుసగా గెలుస్తుంది. లేదంటే వరుసగా ఓడిపోతోంది. అయితే అటు, లేకపోతే ఇటు అన్నట్టుగా ఉంది. అంటే క్లిక్ అయితే తుక్కు రేగ్గొట్టేస్తున్నారు. లేదంటే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News