BigTV English

Heavy Rains Alert : ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు

Heavy Rains Alert : ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు

Heavy Rains Alert to AP : అతి తీవ్రమైన మండుటెండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూల్ న్యూస్ చెప్పింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది.


సోమవారం రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే మిగతా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read : దేశమంతా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ


మంగళవారం (మే 6) కూడా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు.. విజయనగరం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

పిడుగులు పడనున్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఇక నేడు శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 13, మన్యంలో 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు మరో 69 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎండల నుంచి కాస్త విముక్తి లభించింది. మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనుండటంతో వేసవి తాపం కొంతైనా తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Tags

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×