Big Stories

CM Jagan & Modi Relation: మొహనుడి అడుగులు మోడీ వైపేనా..?

AP CM Jagan Mohan Reddy Relationship With PM Modi: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం.. నరేంద్ర మోడీ.. దేశ ప్రధాని.. బీజేపీ కీలక నేత.. వీరిద్దరి మధ్య మంచి దోస్తి ఉందా? వైసీపీ ఎన్డీఏలో లేకపోయినా ప్రస్తుతం రెండు పార్టీల మధ్య మంచి అనుబంధం ఉందా? ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. మోడీకి అన్ని విషయాల్లో మద్ధతిస్తారా? ఏంటి సంబంధం లేకుండా ఉన్నాయా ఈ క్వశ్చన్స్.. మేం ఈ క్వశ్చన్స్ వేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.. అవేంటో చూద్ధాం.

- Advertisement -

విన్నారుగా.. రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ.. వీరిద్దరిలో ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని అని అడిగారు సీఎం జగన్‌ని. దీనికి రాహుల్‌, మోడీ.. ఇద్దరి గురించి తనకు తెలుసు. కొన్ని విషయాలు అంటే మైనార్టీల విషయంలో తప్ప రాహుల్ కంటే మోడీ చాలా బెటర్ అన్నారు సీఎం జగన్.. కాంగ్రెస్‌ను నమ్మే చాన్స్‌ లేదని తేల్చి చెప్పారు. ప్రేమతోనో.. లేదా పక్కవారిపై కోపంతోనే.. మోడీనే బెటర్ అని ఇవ్వకనే సర్టిఫికేట్ ఇచ్చేశారు జగన్.

- Advertisement -

ఉత్తర, దక్షిణ ధృవాలు రెండే ఉన్నట్టు మనకు అయితే ఎన్డీఏ.. లేదంటే ఇండియా.. ఇలా రెండే కూటములు ఉన్నాయి ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్‌లో అయితే ఇందులో చేరాలి.. లేదంటే అందులో చేరాలి. ఇక ఏదీ కుదరకపోతే.. సింగిల్‌గా ఉండిపోవడం తప్ప చేసేదేం లేదు. ప్రస్తుతం వైసీపీ చేస్తున్నది అదే అనుకోండి. బట్.. జస్ట్‌ ఫర్ డిబేట్ సేక్.. రేపు ఎన్నికల్లో వైసీపీ గెలిచి.. కూటమి ఓడిపోతే.. ఎట్ ది సేమ్ టైమ్ కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే జగన్ అడుగులు ఎటు వైపు పడతాయి? అనేది ఇంట్రెస్టింగ్‌ క్వశ్చన్.. ఈ క్వశ్చన్‌ నుంచే మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయి.

Also Read: పొలిటికల్ ల్యాండ్‌ మైన్..

నిజానికి వైసీపీ ఎప్పుడూ ఏ కూటమిలో లేదు. చేరలేదు. కానీ మోడీకి ఫుల్ సపోర్ట్ చేశారు జగన్.. చాలా బిల్లులకు మద్దతిచ్చారు. ఎందుకు అని అడిగితే దేశ కోసం దేశాభివృద్ధిలో భాగమవడం కోసమని సమాధానాలు చెప్పారు. కానీ ఇప్పుడు సినారియో వేరు. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక కూటమిలో చేరింది బీజేపీ.. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ నేతలు కూడా వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ అంతు తేలుస్తామని వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. కానీ ఇవి నిజంగా మనసులో నుంచి వస్తున్న డైలాగ్సా? లేక ఎన్నికల కోసం మాత్రమే వాడుతున్న పదాలా? ఎందుకంటే రాష్ట్రంలో కూటమి తనకు కుంపటి పెడుతుందని తెలిసి కూడా..మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు జగన్. అదే ఎందుకు అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్.

మాములుగా జగన్‌ ఓ కొరకరాని కొయ్య అనేది రాజకీయ నేతలు చెప్పే మాట. కొన్నిసార్లు ఓ అడుగు వెనక్కి వేసినా అనుకున్నది సాధించే మొండిఘటమనే విమర్శలు ఉన్నాయి. అలాంటి జగన్‌ తనపై ఇన్ని విమర్శలు చేస్తున్నా.. మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే.. సమ్‌థింగ్ ఈస్ ఫిషీ అన్నట్టుగానే ఉంది వ్యవహారం. నిజానికి ప్రధాని మోడీ ఏపీలో సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా.. ఎక్కువగా జగన్‌ను టార్గెట్ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్‌ తిట్టాల్సినంత తిట్టకపోతే ప్రజలకు కూడా వినసొంపుగా ఉండటం లేదు. నో అఫెన్స్.. ఇది హార్డ్ రియాలిటీ.. ఇటు మోడీ హద్దు దాటడం లేదు. అటు జగన్ అసలు హద్దు వైపు చూడటమే లేదు. ఇదే ఇప్పుడు మిస్ట్రరీగా ఉంది.

Also Read: ROJA Nagari Politics: రోజాకు రింగా రింగా.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

అయితే జగన్ ఇక్కడ ముందు జాగ్రత్త పడుతున్నారా? అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారాయన.. అంతే కాదు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారే గెలుస్తుందన్న అంచనా కూడా ఉన్నట్టుంది. అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు? అనే థాట్‌లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఓడినా.. తర్వాత తనకు కేంద్ర పెద్దలతో గుడ్ రిలేషన్ షిప్‌ అవసరమన్న ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు.

అసలు జగన్ చుట్టూ కేసుల వల ఉంది. అటు ఈడీ.. ఇటు సీబీఐ.. జగన్‌ కేసులపై పాస్‌ బటన్ నొక్కి ఉంచాయి. ఇక్కడ అధికారం కోల్పోయినా కేంద్రం తన అవసరం లేదని గుర్తించిన మరుక్షణం ఈ కేసుల తుట్టే కదలడం ఖాయమన్న భయం కూడా ఉన్నట్టు అంచనా.. అందుకే ముందుజాగ్రత్తగా ఇలాంటి హింట్స్ పంపిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే జగన్ అడుగులు మోడీ వైపు పడుతున్నాయా? అనే డౌట్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News