Big Stories

BJP Constitution Change Comments: రాజ్యాంగం మార్చేస్తారా..? అసలు సెక్యూలర్ అనే పదం అర్థం ఏంటి..? ఫుల్ స్టోరీ!

Dushyant Kumar Gautamremarks on ‘Amending Constitution: బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. అందుకే 400 సీట్లలో గెలిపించాలని అడుగుతున్నారు. ఇది గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాటలు.. ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు అగ్గిని రాజేశాయి. మరి ఈ అగ్గిని ఆర్పాల్సిన బీజేపీ పెద్దలు.. నీటికి బదులు పెట్రోల్‌ను పోశారు. అదేలానో మీరే చూడండి.

- Advertisement -

ఇయన పేరు దుశ్యంత్ కుమార్ గౌతమ్.. బీజేపీ ప్రధాన కార్యదర్శి.. ఆయన స్పష్టమైన హిందిలో చెబుతుంది ఏంటంటే.. మేం అధికారంలోకి రాగానే రాజ్యాంగం పీఠికను మార్చేస్తాం. రాజ్యాంగంలో లౌకిక అంటే సెక్యూలర్ అనే పదాన్ని తొలగిస్తాం. ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు. కాంగ్రెస్ రాజ్యాంగానికి సవరణ చేసి తీసుకొచ్చింది. సో మేం అధికారంలోకి రాగానే తీసివేస్తాం. ఇది ఆయన చెప్పిన విషయం. అదీ సంగతి.. ఇప్పుడు చెప్పండి. బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు ఇప్పుడు సమాధానం దొరికినట్టైంది.

- Advertisement -

నిన్నటి వరకు జరిగిన పంచాయితీ ఏంటి.. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు.. అలాంటిదేం లేదన్నారు. కానీ జరిగిందేంటి.. ఏకంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతున్నారు రాజ్యాంగ పీఠికను మారుస్తామని.. సెక్యూలర్ అనే పదాన్ని పీకి పారేస్తామని.. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..? : ప్రియాంకా గాంధీ

ఇవీ సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. మరి ఇంతకీ రాజ్యాంగ పిఠికలో సెక్యూలర్ అనే పదాన్ని చేర్చడం వెనక స్టోరీ ఏంటి..? నిజానికి ఇది నిజంగానే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ పదం లేదు. దీనిని ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా.. రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అదే.. సెక్యూలర్ అనే పదాన్ని పొందుపరిచింది. నిజానికి దీనిని జార్జి జాకబ్ హోలియోక్ అనే సోషల్ సైంటిస్ట్ 19th సెంచూరీలో వాడుకలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని, పరిపాలనను మతం నుంచి కాకుండా చట్టం, రాజ్యాంగం ప్రకారంపాలించడమే ఈ పదానికి అర్థం. అయితే దీనిపై చాలా డీబెట్స్ నడిచాయి. ఈ పదం లేకపోయినా ప్రాథమిక హక్కుల్లోని 25 నుంచి 28 వరకు ఉన్న పాయింట్స్‌ను అబ్జర్వ్ చేస్తే భారత్ అనేది లౌకిక రాజ్యమే అని తెలుస్తుంది.

కానీ అఫిషియల్‌గా ఆ పదాన్ని తొలగిస్తే ఏమవుతుంది..? ఇలా మార్చి బీజేపీ ప్రపంచ దేశాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది..? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.. నిజానికి ఇప్పుడే కాదు ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా చాలా సార్లు చేశారు బీజేపీ నేతలు.. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం రాజ్యాంగ సమీక్ష కోసం వేసిన కమిటీ కూడా దీనిపై అధ్యయనం చేసింది. నిజానికి ఈ పదానికి ఉన్న పవర్ చాలా ఎక్కవ అనే చెప్పాలి. ప్రస్తుతం భారతదేశంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ దీనిని తీసివేస్తే.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి..? అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను.

Also Read: Political Heat In Venkatagiri: వెంకటగిరిలో గెలుపెవరిది?

నిజానికి అదే బీజేపీ కోరుకుంటుందా..? అందుకే సెక్యూలర్ అనే పదాన్ని తొలగించాలనుకుంటున్నారా..? అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్.. బీజేపీ నేతల మాటలు చూస్తుంటే చెప్పేదొకటి.. చేసేది ఒకటి.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి.. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. ఇలాంటి విషయాలు ఏవీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడం లేదు. ఆల్ ఆఫ్‌ సడెన్‌ ప్రజల ముందుకు రావడం.. అనౌన్స్ చేయడం జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్.. నోట్లరద్దు.. రేపు అధికారంలోకి వచ్చాక సరాసరి స్క్రీన్‌ ముందో.. లేదా పార్లమెంట్ ముందు సడెన్‌గా కొత్త బిల్లులు తీసుకురారని గ్యారెంటీ ఏంటి? ఇవీ మన ప్రశ్నలు కాదు.. కాంగ్రెస్‌ నేతలు వేస్తున్నవి.. ఏదేమైనా సరిగ్గా ఎన్నికల ముందు రాజ్యాంగంలో మార్పుల టాపిక్‌ మాత్రం ఇప్పుడు దేశాన్ని దహించి వేస్తుంది. మరి ఈ మంటలు మరెన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News