Big Stories

PM Modi at Anakapalli: అనకాపల్లికి మోదీ, వైసీపీ ఛాలెంజ్, అలాగైతే తాను తప్పుకుంటా?

PM Modi public meeting at Rajahmundry(AP political news): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం ఆరురోజులు మాత్రమే ఉంది. ఇందులోభాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రెండు సభలకు హాజరుకానున్నారు. ఒకటి అనకాపల్లి, మరొకటి రాజమండ్రి. ఈ రెండు చోట్లా బీజేపీ ఎంపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రచార సభకు హాజరుకానున్నారు ప్రధాని.

- Advertisement -

సాయంత్రం ఐదున్నర గంటలకు రాజమండ్రి నుండి అనకాపల్లిలోని రాజుపాలెం చేరుకుంటారు ప్రధాని నరేంద్రమోదీ. ఐదున్నర నుంచి ఆరున్నర వరకు జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం అనకాపల్లి నుండి రోడ్డు మార్గంలో రాత్రి ఏడున్నరకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్లనున్నారు.

- Advertisement -

మోదీ ఉమ్మడి విశాఖ జిల్లాకు రానుండడంతో ప్రచార సభలో స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అక్కడి ప్రజలు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏదో ఒక ప్రకటన వస్తుందని బలంటా నమ్ముతున్నారు విశాఖ వాసులు. దీనికితోడు ప్రధాని మోదీ ఇచ్చే హామీలపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.

పరిస్థితి గమనించిన మంత్రి, గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీపరం చేయమని ప్రధాని ప్రకటన చేస్తే.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడమేకాదు, గాజువాక సీటును కూడా వారికే వదిలేస్తానని ఛాలెంజ్ విసిరారు. మరి ఛాలెంజ్‌ను బీజేపీ తీసుకుంటుందా? ఎన్నికల్లో నేతలు ఇలాంటి సవాళ్లు విరసడం కామనేనని సరిపెట్టు కుంటుందా? అనేది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

అటు అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు షుగర్ ఫ్యాక్టరీలు గడిచిన ఐదేళ్ల కాలంలో మూతబడ్డాయన్నారు. వాటిని తారు తెరిపిస్తానని తాను హామీ ఇవ్వనన్నారు. ఎందుకంటే తెరిపించే స్థాయి దాటిపోయిందన్నారు. చెరకు రైతుల కోసం విత్తనాల ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు గల కారణాలను వివరించారు.

ALSO READ:  జగన్ తీసుకొచ్చిన ఆ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు

అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ రాజమండ్రి బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడిని బీజేపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. రాజమండ్రి సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సభ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అక్కడికి ప్రధాని రాబోతున్నారు. ఈ సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. చంద్రబాబు మాత్రం అనకాపల్లి సభకు ప్రధానితో కలిసి పాల్గొంటారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News