E-Paper
Advertisement

Mamitha Baiju: అమ్మాయి మమితా.. నీ పేరు వెనుక ఇంత కథ ఉందా..?

Mamitha Baiju: అమ్మాయి మమితా.. నీ పేరు వెనుక ఇంత కథ ఉందా..?
Advertisement

Mamitha Baiju latest update(Cinema news in telugu): ప్రస్తుతం ఎక్కడ చూసినా మమిత బైజు పేరే వినిపిస్తుంది. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ తీసుకున్నా ఆమెనే కనిపిస్తుంది. అందుకు కారణం.. ఆమె నటించిన ఒక చిన్న సినిమా బాక్సాఫీసును షేక్ చేయడమే. ఆ సినిమా మరేదో కాదు. ‘ప్రేమలు’. మలయాళంలో ఒక సాదా సీదా సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే రిలీజ్‌కు ముందు ఇది చిన్న సినిమానే కదా.. ఎవరు చూస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది.. అదొక అద్భుతమైన సినిమా అని. దీంతో ఫస్ట్ షో పాజిటివ్ రెస్పాన్స్‌ అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టారు. విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు బాక్సాఫీసు వద్ద ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్లను నమోదు చేసింది.

Advertisement

ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ప్రముఖ బడా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయించాడు. ఇక తెలుగులో కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ను ప్రేమలు మూవీ అందుకుంది. ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది.

Also Read: హిట్ సినిమాకు సీక్వెల్.. ఇక అధికారికం

Advertisement

ముఖ్యంగా ఈ మూవీ ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడంలో నటీ నటుల పాత్ర ఎంతో కీలకమైంది. అందులోనూ నటి మమిత బైజు నాచురల్ లుక్‌లో తన అందం, యాక్టింగ్‌తో అందరి మదిని దోచుకుంది. నిజంగా ఆమె అందానికి, యాక్టింగ్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. అలాంటి పెర్ఫార్మెన్స్ చేసింది ఈ కేరళా కుట్టి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోయింది. ఎక్కడ చూసినా ఆమె వీడియోలు, ఫొటోలే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె పేరుకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిజానికి ఆమె పేరు మమిత కాదట. అవును మీరు విన్నది నిజమే. మరి ఆమె పేరు మమిత కాకపోతే మరేంటని అనుకుంటున్నారా?.. ఆగండి అక్కడకే వస్తున్నాం.. ఆమె పేరు వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉందండోయ్. అదే విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నిజానికి తన పేరు నమితా అని.. మమితా కాదని చెప్పింది. తాను పుట్టినపుడు హాస్సిటల్ సిబ్బంది తన పేరును నమిత (N)కి బదులుగా మమిత (M)గా నమోదు చేశారట. దీంతో ఒక్క అక్షరం మార్పుతో నమిత అవ్వాల్సిన తాను మమిత అయ్యానని తెలిపింది. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ సమయంలో తమ పేరెంట్స్ పెద్దగా చూసుకోలేదని.. కానీ అది స్కూల్‌లో జాయిన్ అయిన సమయంలో గుర్తించారని పేర్కొంది. అప్పటికి చేసేది ఏమి లేక మమితగానే స్కూల్‌లో జాయిన్ అయినట్లు తెలిపింది. అయితే మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్థం వస్తుందని చెప్పుకొచ్చింది. ఇంకా మరికొన్ని విషయాలు చెబుతూ ప్రేమలు మూవీ తన మొదటి సినిమా కాదని.. అంతక ముందు చాలా సినిమాలు చేశానని తెలిపింది. ప్రేమలు మూవీ తన 16వ సినిమా అని చెప్తూ నవ్వేసింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×