BigTV English
Advertisement

IPL 2024, LSG vs KKR Highlights: కోల్ కతా నెంబర్ వన్.. లక్నో ఘోర పరాజయం

IPL 2024, LSG vs KKR Highlights: కోల్ కతా నెంబర్ వన్.. లక్నో ఘోర పరాజయం
Lucknow Super Giants vs Kolkata Knight Riders IPL 2024 Highlights: కోల్ కతా నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చింది. ఊహించని రీతిలో ఈ స్థాయికి రావడం గొప్ప విషయమనే చెప్పాలి. లక్నో తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించిన కోల్ కతా టాప్ లోకి అలా చేరింది.

టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగు తీసుకుంది. బ్యాటింగ్ కి వచ్చిన కోల్ కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 98 పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది.


236 పరుగుల లక్ష్యంతో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. లక్ష్యం భారీగా ఉండటంతో పవర్ ప్లేలో గట్టిగా కొడదామని భావించి త్వరత్వరగా వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ అర్షిణ్ కులకర్ణి (9) చేసి అవుట్ అయ్యాడు. మరో  ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (25) తనూ త్వరగా అయిపోయాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన మార్కస్ స్టొయినిస్ (36) కొద్దిగా నిలబడి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు.

దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), ఆయుష్ బదొని (15), టర్నర్ (16) అయిపోవడంతో తర్వాత వచ్చిన వాళ్లు సింగిల్ డిజిట్ కే అయిపోయారు. ఇలా మొత్తానికి 16.1 ఓవర్లలో 137కి ఆలౌట్ అయిపోయింది.


Also Read: తిప్పేసిన జడేజా.. చెన్నైతో పోరులో చిత్తుగా ఓడిన పంజాబ్..!

కోల్ కతా బౌలింగులో హర్షిత్ రాణా 3, వరుణ్ 3, మిచెల్ స్టార్క్ 1, సునీల్ నరైన్ 1, అండ్రీ రసెల్ 2 వికెట్లు పడగొట్టారు.

అంతకు ముందు ఫస్ట్ బ్యాటింగ్  చేసిన కోల్ కతా జట్టు ఒక రేంజ్ లో ఆడింది. పవర్ ప్లేను ఉపయోగించుకున్న ఓపెనర్లు ఇద్దరూ దంచి కొట్టారు. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 1 సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ 39 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి బలమైన పునాదులు వేశాడు. ఇదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

తర్వాత అందరూ దొరికిన బాల్ ని దొరికినట్టు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారు పెద్ద స్కోర్లు చేయలేదు, కానీ స్కోరుని పరుగులెత్తించారు. అయితే అంగ్ క్రిష్ రఘువంశీ (32), ఆండ్రీ రసెల్ (12), రింకూ సింగ్ (16), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ (25) ఇలా ఫటాఫట్ ఆడారు. మొత్తానికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేశారు.

లక్నో బౌలింగులో నవీన్ ఉల్ హక్ 3, యష్ ఠాగూర్ 1. రవి బిష్ణోయ్ 1, యుథ్వీర్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×