E-Paper
Advertisement

Bernard hill: విషాదం.. 11 ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ నటుడు మృతి

Bernard hill: విషాదం.. 11 ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ నటుడు మృతి
Advertisement

Taitanic Movie actor bernard hill passed away: సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. 79 సంవత్సరాల వయస్సులో ఆయన తుదిశ్వాస విడిచారు. బెర్నార్డ్ హిల్ కన్నుమూశారన్న విషయం ఆయనతోపాటు పలు సినిమాల్లో నటించిన బార్బారా డిక్సన్ అనే నటి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Titanic Movie Actor
Titanic Movie Actor

ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియాలో ద్వారా సంతాపం ప్రకటిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. హిల్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంటూ అతడి నటన అద్భుతమంటూ అతడి నటనను ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా అతనితో ఉన్న అనుబంధాలను వారు గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

సోషల్ మీడియా X ద్వారా దు:ఖకరమైన వార్తను తెలియజేస్తూ బార్బరా డిక్సన్ ఇలా పేర్కొన్నారు..’నేను బెర్నార్డ్ హిల్ మరణాన్ని గమనించడం చాలా బాధగా ఉంది. మేము జాన్ పాల్ జార్జ్ రింగో మరియు బెర్ట్, విల్లీ రస్సెల్ యొక్క అద్భుతమైన ప్రదర్శన 1974-75 లో కలిసి పనిచేశాం. నిజంగా హిల్ చెప్పుకోదగ్గ నటుడు. రిప్ బెన్నీ’ అంటూ ఆమె భావోద్వేగంతో అందులో పేర్కొన్నది.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంపాటు పనిచేసిన హిల్ తనదైన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు.. 11 ఆస్కార్ అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు. భాషలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప నటుడు హిల్. కాగా, 1944వ సంవత్సరంలో యూకేలోని మంచెస్టర్ లో ఆయన జన్మించారు. నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన సినిమా రంగం వైపు అడుగులు వేశారు. మొదటగా ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు వెళ్లగలిగారు. తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక, 1997లో విడుదలైనటువంటి టైటానిక్ చిత్రంలో కూడా బెర్నార్డ్ హిల్ నటించారు. అందులో ఆయన కెప్టెన్ ఎడ్వర్డ్ పాత్రను పోషించారు. ఈ పాత్రనే టైటానిక్ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాత్ర పోషించిన బెర్నార్డ్ హిల్ కు మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు అతడి నటనను అభినందిస్తూ భారీగా ప్రశంసలు వెల్లువెత్తాయి. టైటానిక్ చిత్రంతోపాటు పలు చిత్రాల్లో కూడా బెర్నార్డ్ హిల్ నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు, థియేటర్ లలో కూడా హిల్ పనిచేశారు. అయితే, బెర్నార్డ్ హిల్ ఎక్కడ పనిచేసినా కూడా అద్భుతంగా నటిస్తూ ముందుకు రాణించారు.

Also Read: గెటప్ శ్రీను పొలంలో మొలకలొచ్చాయి..లిప్ కిస్ పెట్టిసిన హీరోయిన్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి ఎన్నో సినిమాల్లో అతని చిరస్మరణీయ ప్రదర్శనలను కొనియాడుతూ, అతని నటనా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ సినీ ప్రేక్షకులు, అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బెర్నార్డ్ హిల్ కు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులర్పిస్తున్నారు. బెర్నార్డ్ హిల్ మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ వారు పేర్కొంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×