Big Stories

AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు దేని గురించి ఈ యాక్ట్‌..?

- Advertisement -

మనకు తెలిసిందే.. ఏపీ పొలిటికల్ నేతలు నిప్పు లేకుండానే అగ్గి రాజేసే రకం. అలాంటిది ఎన్నో అనుమానాలు ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ఎక్స్‌పరిమెంటల్‌గా అమలు చేస్తుండటం. అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం జరిగితే.. ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు. ప్రస్తుతం అదే జరుగుతుంది. ప్రస్తుతం మండిపోతున్న భానుడి భగభగలకన్నా హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేస్తున్నారు నేతలు.

- Advertisement -

మీ భూములు పోతాయి.. మీ భూములపై హక్కులు కోల్పోతారు. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ అన్ని ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఇదీ విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు మరి అధికార పక్షం ఊరుకుంటుందా విన్నదానికి మరో రెండు పదాలు కలిపి వినిపించడం అలవాటే కదా.. సో అదే స్థాయిలో కౌంటర్లు మొదలయ్యాయి.

Also Read: సైకో, నియంత పాలన అంతం కోసమే.. : చంద్రబాబు

ఇదీ అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్.. ఇంతకీ ఈ యాక్ట్‌లో ఏముంది..? అసలు దేని గురించి ఈ యాక్ట్‌..? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలో చాలా భూమి ఉంది.. అందులో వ్యవసాయ భూమి.. వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాల భూములుఉన్నాయి. ఈ భూములకు బ్రిటీష్‌ కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రికార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏ పంచాయితీ అయినా వచ్చిందనుకోండి. మ్యాగ్జిమమ్ కోర్టులకు వెళ్లరు.. పెద్దల ముందు కూర్చొని మాట్లాడుకొని తేల్చుకుంటారు. ఎందుకు..? కోర్టుకు వెళితే ఏ రికార్డు తవ్వితే ఎక్కడ తేలుతుందో అని భయం. అంటే ఇప్పటికీ చాలా వరకు భూములకు సరైన రికార్డులు లేవు. అందుకే ఈ యాక్ట్‌ను తీసుకొచ్చామని చెబుతుంది కేంద్రం. ఈ చట్టం కింద.. భూమిపై యజమానులకు హక్కు కల్పించి. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే అని చెబుతుంది.

ఇక్కడే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవేంటంటే.. ఎవరైనా తప్పుడు పత్రాలు చూపించి దానిని రిజిస్ట్రర్ చేసుకుంటే..? ఇక వారికే ఈ భూమి చెందుతుందా? అసలు యజమానులు ఏం చేయలేరా? దీనికి కూడా ఆన్సర్ చెబుతుంది ఈ యాక్ట్.. ముందు భూముల లెక్కలు తేలుస్తారు.. అవి కూడా ఏ వివాదం లేని భూములు టైటిల్ రిజిస్టర్‌లో ఎంటర్ చేస్తారు. వివాదాలు ఉన్న భూములను ఓ స్పెషల్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వీటి పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది. అయితే అంత ఈజీగా దీనిని నిర్ధారించరు. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలో చెప్పాలి. రెండేళ్లలో అభ్యంతరాలు చెప్పకపోతే ఇక కోర్టుకు వెళ్లినా లాభం ఉండదు.

Also Read: ఫ్యాన్ గాలికి హామీలు కొట్టుకుపోయాయ్: వైఎస్ షర్మిల

ఇవి చట్టం డిటెయిల్స్ మరి వివాదం ఎందుకు? ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో ఈ యాక్ట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అది కూడా సెలెక్ట్ చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాత్రమే చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కావడంతో నమోదు చేసిన తర్వాత ఒరిజినల్ కాకుండా జిరాక్స్‌లు ఇస్తున్నారు. ఇక్కడ మొదలైంది పంచాయితీ.. ఈ అంశమే ఎన్నికల అస్త్రంగా మారింది. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని మరోసారి జగన్ అధికారంలోకి వస్తే… మీ భూములను కొట్టాస్తారంటూ విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకే అలాంటి ప్రచారాలు చేయిస్తున్నారంటూ వైసీపీ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. 2019లో కేంద్రం దీనిపై కమిటీ వేసిందని దాన్ని వైసీపీపై రుద్దేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నది వైసీపీ నేతల కౌంటర్లు.

అంతా బాగుంది. ఇది నిజంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయమే.. ఇదీ నిజమే.. కానీ వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తుంది? వివాదస్పదం అని తెలిసి కూడా కొరివితో ఎందుకు తలగొక్కుంటుంది? ఏ రాష్ట్రమూ చేయని సాహసం వైసీపీ ప్రభుత్వమే ఎందుకు చేస్తుంది? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.. ఇది కావాలనే పొలిటికల్ రచ్చను రాజేసే ఉద్దేశమా? లేక ఈ చట్టంపై విపక్షాలపై విమర్శలు చేయించి.. కూటమిలో బీటలు తెచ్చే ప్రయత్నమా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.. మొత్తానికి ఎన్నికల వరకు విపక్షం ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ ఆగేలా కనిపించడం లేదు. అధికార పక్షం ఎంత క్లారిటీ ఇచ్చినా విపక్షం ఆగేట్టు కనిపించడం లేదు. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే అది మే 13 తర్వాతే..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News