Big Stories

Rishi Sunak: రిషి సునాక్ చెవిలో సీక్రెట్!.. మీటింగ్ నుంచి అవుట్.. అసలేం జరిగింది?

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. హైప్రొఫైల్ పర్సన్. ఈజిప్టులో జరుగుతున్న కాప్-27 సమావేశంలో బిజీగా ఉన్నారు. వేదికపై వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి ఉన్నారు. ఉన్నట్టుండి హడావుడి. పీఎం స్టాఫ్ ఒకరు డయాస్ మీదకు వచ్చి రుషి చెవిలో ఏదో చెప్పారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాడు. మరికాసేపటికే మరో సిబ్బంది వచ్చారు. రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారు. అంతే, వెంటనే కుర్చీలోంచి లేచి.. వడివడిగా వేదిక దిగిపోయారు. బ్రిటన్ అధికారులతో కలిసి మీటింగ్ హాల్ నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఇదీ జరిగింది? ఇంతకీ అసలేం జరిగింది? ఆ సిబ్బంది ప్రధాని రిషి సునాక్ చెవిలో రహస్యంగా ఏం చెప్పారు? వారు ఎందుకంత కంగారు పడ్డారు? అంత హఠాత్తుగా ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఇలా అనేక ప్రశ్నలు.

- Advertisement -

అది మామూలు సమావేశం కాదు. కాప్‌-27. అంతర్జాతీయ పర్యావరణ సదస్సు. కొన్నిరోజుల క్రితం ఆ మీటింగ్ కు హాజరుకాబోనని చెప్పారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మళ్లీ మనసు మార్చుకున్నారు. ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సుకు హాజరయ్యారు. అంతటి కీలక సమావేశం నుంచి బ్రిటన్ ప్రధాని అర్థాంతరంగా, హడావుడిగా వెళ్లిపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన వెళ్తున్న విజువల్స్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

- Advertisement -

భద్రతా కారణాలు మినహా.. మరే ఇతర అంశమైనా ఇంతటి హడావుడి జరిగి ఉండేది కాదని అంటున్నారు. బ్రిటన్ లో మరేదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఉంటే అది ఈపాటికే ప్రపంచానికి తెలిసుండేది. రిషి సునాక్ చెవిలో సిబ్బంది అంత రహస్యంగా ఏదో చెప్పారంటే.. బహుషా సెక్యూరిటీ రీజన్సే బ్రిటన్ ప్రధాని వెళ్లిపోవడానికి కారణమై ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News