BigTV English
Advertisement

AstraZeneca Covid vaccine : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

AstraZeneca Covid vaccine : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

Astrazeneca covid vaccine news(Current news in World): ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజమైన ఆస్ట్రాజెనెకా.. తాను రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ తో మరికొన్ని అనారోగ్యాలకు కారణమవుతుందని లండన్ కోర్టులో అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసింది. వాణిజ్య కారణాలతో మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం తెలిపింది.


ఇకపై వ్యాక్సిన్ ను తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి ఉండవని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని ఒక కో-ఇన్సిడెన్స్ గా పేర్కొంది. టీకా TTS – థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌కు కారణమవుతుందన్న కారణంతో మాత్రం సరఫరాను నిలిపివేయడం లేదని స్పష్టంగా చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ ఉపసంహరణ దరఖాస్తు మార్చి 5న సమర్పించగా.. ఇది మంగళవారం (మే 7) నుంచి అమల్లోకి వచ్చింది.

Also Read : కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా..!


టీకాను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి కూడా ఆస్ట్రాజెనెకా తన వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనుంది. కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన మొదటి సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డోస్ లను సరఫరా చేసి.. 6.5 మిలియన్ల మంది ప్రాణాలను రక్షించామని ఆస్ట్రాజెనెకా చెప్పింది. టీకా ఉపసంహరణకు వాణిజ్య పరమైన కారణాలను చూపించినా.. అసలు కారణం మాత్రం దుష్ప్రభావమేనని తెలుస్తోంది.

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×