BigTV English

North Korea: “ఉత్తర కొరియా గోబెల్స్ కిమ్ కీ నామ్” మృతి.. కిమ్ జోంగ్ ఉన్ సంతాపం

North Korea: “ఉత్తర కొరియా గోబెల్స్ కిమ్ కీ నామ్” మృతి.. కిమ్ జోంగ్ ఉన్ సంతాపం

North Korea Kim Family’s Master Propagandist Kim Ki Nam Dies at 94: ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి “కిమ్ కీ నామ్”(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది. అతను వృద్ధాప్యం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకపోవడం” కారణంగా మరణించినట్లు అధికారిక KCNA తెలిపింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అతని కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున ఆయన అంత్యక్రియలకు హాజరయి నివాళులు అర్పించారు.


కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా పాలనకు అపరిమితంగా విధేయత చూపిన అనుభవజ్ఞుడైన విప్లవకారుడిగా.. చివరి వరకు దేశానికి అత్యంత విధేయుడుగా పనిచేశాడాని తెలిపాడు. కిమ్ కి నామ్ ఉత్తరకొరియాలో మూడు తరాలపాటు రాజకీయనాయకుడిగా సేవలందించారు. అతను రాష్ట్ర రాజకీయ చట్టబద్దతో పాటు, మీడియా, ప్రచురణ కార్యకలాపాలపై నాయకత్వం వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా


ఇక, కిమ్ కి నామ్ 2009లో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అలాగే దక్షిణ కొరియాను సందర్శించిన కొద్దిమంది ఉత్తర కొరియా అధికారులలో కిమ్ కి నామ్ ఒకరు. దక్షణ కొరియా ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం.. 1966లో ప్యోంగ్యాంగ్ యొక్క ప్రచార, ఆందోళన విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు.

1970లో అతను రాష్ట్ర మౌత్ పీస్ రోడాంగ్ సిన్మున్ వార్తాపత్రికకు బాధ్యత వహించారు. 1985 లో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ పాలనలో ప్రధానమంత్రిగా పని చేసినట్లు అధికారంగా పేర్కొన్నారు. 2011లోమరణించిన ప్రస్తుత నాయకుడి కిమ్ జోంగ్ ఇల్‌తో సన్నిహితంగా పనిచేశాడు. కిమ్ కీ నామ్ తర్వాత శాఖకు నాయకత్వం వహించినట్లు దక్షిణ కొరియా పేర్కొంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×