Big Stories

Iron Deficiency: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా..! ఈ ఫుడ్స్ ట్రై చేయండి

Iron Deficiency: మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే అందుకు అవసరమైన పోషకాలను అందించాలి. సూక్ష్మ పోషకాలు ఉండే ఆహార పదార్థాలను మనం డైట్ లో భాగంగా చేసుకోవాలి. మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాల్లో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితేనే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్ ను శరీర భాగాలకు అందజేస్తుంది.

- Advertisement -

మన శరీరంలో ఒక వేళ ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. రక్త హీనత కారణంగా అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు ఎలాంటి ఆహారాన్ని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్,సిట్రస్ ప్రూట్స్ : ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా రక్తహీనత వస్తుంది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా నారింజ, నిమ్మ, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆకు కూరలు, సిట్రస్ పండ్లు డైట్ లో చేర్చుకుంటే మన శరీరానికి అవసరమైన  విటమిన్ సి కంటెంట్ లభిస్తుంది. దీని ద్వారా రక్త హీనతకు మనం చెక్ పెట్టొచ్చు.

రాగి పాత్రలు: ఒకప్పుడు మన జీవన విధానంలో రాగి పాత్రలు భాగంగా ఉండేవి. కానీ క్రమంగా వీటి వినియోగం తగ్గింది. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు త్రాగడం మంచిది. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఫలితంగా శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. రాగి ముఖ్యమైన ట్రేస్ మెటీరియల్ ..కొన్ని హెమటోలాజికల్ కండిషన్స్ నివారించడానికి ఇది అవసరం అవుతుంది.

Also Read: బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటే చాలా మంచిదట.. ఎప్పుడైనా ట్రై చేశారా?

సీడ్స్ : వివిధ రకాల నట్స్, సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చియా, గుమ్మడికాయ, ఫ్లాక్స్ వంటి విత్తనాల్లో ఐరన్, ఫోలేట్, జింక్ తో పాటు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఓట్ మీల్, స్మూతీస్, సలాడ్స్ తో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీని ద్వారా ఐరన్ లోపం తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News