Janhvi Kapoor Shared Issues Faced at 13 Age: అందాల అతిలోక సుందరి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అయితే అదొక్కటే ఆమెకు దక్కిన వరం. కానీ, ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిరూపించుకోవడానికి తనంతట తానే కష్టపడుతూ వస్తుంది. తల్లితండ్రి పేరు చెప్పుకొని వచ్చినా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే ఎవరికి వారే కష్టపడాలి. ప్రస్తుతం జాన్వీ అదే చేస్తుంది. మంచి కథలను ఎంచుకొని.. అభిమానుల చేత మంచి నటి అనిపించుకోవడానికి జాన్వీ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలతో బిజీగా మారింది.
ప్రస్తుతం జాన్వీ చేతిలో దాదాపు నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తుంది. ఇది కాకుండా రామ్ చరణ్ సరసన ఒక సినిమా చేస్తోంది. ఇక హిందీలో రాజ్ కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ ధోనిలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ షురూ చేసిన జాన్వీ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ తన చిన్నతనంలో జరిగిన క చేదు ఘటనను తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. సెలబ్రిటీలు అయినా కూడా తాము ఎన్నో అవమానాలకు గురి అయ్యినట్లు తెలిపింది.” నా 13 ఏళ్ళ వయస్సులో నా ఫోటోలను పోర్న్ సైట్ లో అప్లోడ్ చేశారు. వాటిని నా ఫ్రెండ్స్ కూడా చూసారు. చూడు..చూడు శ్రీదేవి కూతురు ఎలా ఉందో అంటూ అసభ్యంగా కామెంట్స్ చేశారు.
Also Read: Deepika Padukone: బేబీ బంప్ తో దీపికా.. ఓటు వేయడానికి వచ్చిన స్టార్ కపుల్
స్కూల్ కి వెళ్తే నన్ను ఏడిపించారు. ఆ సమయంలో నాకేం తెలిసేది కాదు. నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాను. వాటి మీద అవగహన తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇలాంటివి జరిగినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ట్రోల్స్ ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.