Raghu Rama Krishna Raju Shares Interesting Photo: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ క్రమంలో నేను గెలుస్తానా.. ? లేదా నాతో తలపడిన అభ్యర్థులు గెలుస్తారా? అని పోటీ చేసినవారు ఎదురుచూపులు చూస్తున్నారు. అటు పార్టీలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాయి.
మేం అధికారంలోకి రాబోతున్నామంటే.. మేం అధికారంలోకి రాబోతున్నామంటూ చర్చించుకుంటున్నాయి. ఇటు పార్టీల అధ్యక్షులు కూడా గెలుపు పక్కా కానీ, ఎన్ని సీట్లు.. ఎంత మెజారిటీ అంటూ ఫలితాల రోజు వెల్లడైతుందని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇటు ఆ రాష్ట్ర ప్రజలు కూడా అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి..? ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు..? ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు..? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలోని పలు ప్రాంతాల్లో పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగింది. ఏంటి అక్కడ ఆ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి..? అసలు ఇంతకు ఎవరు గెలవబోతున్నారు..? అని దేశ ప్రజలు కూడా ఫలితాలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత ఓ ఫొటోను షేర్ చేశారు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు. అయితే, ఓ ఫొటోను షేర్ చేసి పలు విషయాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ ఫొటో విషయమై అంతా ఆసక్తిగా చర్చిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: SIT Report: డీజీపీకి చేరిన సిట్ ప్రాథమిక నివేదిక.. అందులో ఏముందంటే..?
అయితే, నేడు భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోను షేర్ చేసి భారత దేశ మాజీ రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నానంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
Also Read: చరిత్రలోనే తొలిసారి.. ఏపీ పోలీసులపై కొనసాగుతున్న సిట్ విచారణ..
అయితే, రఘురామకృష్ణరాజు ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్నారు. ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అంచనాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు.. టీడీపీ కూటమికి 125 నుంచి 150 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీకి కేవలం 40 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. తన అంచనాలు నిజమవుతాయో కాదో అనేది జూన్ 4న తెలుస్తది అని ఆయన అన్నారు. ఏపీకి మంచి జరగాలని, అదేవిధంగా ఏపీకి చంద్రబాబు సీఎం కావాలని తాను తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
భారత దేశ మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/QmKGWItcGy
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) May 19, 2024