Big Stories

iVOOMi launches JeetX ZE e-scooter : 170 కిమీ రేంజ్‌తో రూ.79 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. మే 10 నుంచి బుకింగ్స్!

iVOOMi launches JeetX ZE e-scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రముఖ ఇన్నోవేటర్ అయిన iVooMi ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ JeetX ZE పేరుతో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ బుకింగ్ మే 10 నుంచి ప్రారంభమవుతుంది. 18 నెలల విస్తృత పరిశోధన, అభివృద్ధి తర్వాత ఈ స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ను 100k km టెస్టింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ 3 బ్యాటరీ వేరియంట్లలో లాంచ్ చేశారు. ఈ స్కూటర్ రేంజ్, ఫీచర్లు తదితర వివరాలపై ఓ లుక్కేయండి.

- Advertisement -

కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79999. ఇది 3 బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో మీరు 2.1 kwh, 2.5 kwh, 3 kwh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 170 కిమీ రేంజ్ ఇస్తుంది. కంపెనీ ఈ స్కూటర్‌ను 8 ప్రీమియం రంగుల్లో ప్రవేశపెట్టింది. ఇందులో గ్రే, రెడ్, గ్రీన్, పింక్, ప్రీమియం గోల్డ్, బ్లూ, సిల్వర్, బ్రౌన్ ఉన్నాయి.

- Advertisement -

Also Read : రూ.10 లక్షల్లో పవర్‌ఫుల్ కారు కొనాలా?.. అయితే ఈ లిస్ట్ మీ కోసమే!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1350 మిమీ, 760 మిమీ పొడవు, 770 మిమీ హై సీటుతో కూడిన పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కంపెనీ స్కూటర్‌లో విస్తరించిన లెగ్‌రూమ్, బూట్ స్పేస్‌ను కూడా ఇచ్చింది. దీంతో పాటు భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్కూటర్‌లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అందుబాటులో ఉంది.

Also Read : సేల్స్‌లో నంబర్ వన్‌గా టాటా పంచ్.. డిమాండ్ మామూలుగా లేదుగా!

ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 7 kw గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా,స్కూటర్ 2.4 రెట్లు మెరుగైన కూలింగ్ స్థలాన్ని పొందుతుంది. స్కూటర్‌లో 12 కిలోల రిమూవబుల్ బ్యాటరీ ఉంది. స్కూటర్ ఛాసిస్, బ్యాటరీ, పెయింట్‌పై 5 సంవత్సరాల వారంటీ అందుబాటులో ఉంది. ఇది కాకుండా బ్యాటరీ IP67 తో అమర్చబడి ఉంటుంది. అంటే వర్షంలో తడిస్తే ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది కాకుండా ఈ కంపెనీ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా స్కూటర్‌లోని ఏదైనా పార్ట్‌ని వన్ టైమ్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని అందిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News