BigTV English

NTR’s Devara Fear Song: ఎన్టీఆర్ విధ్వంసం.. గూస్ బంప్స్ గ్యారెంటీ.. రాసుకోండి!

NTR’s Devara Fear Song: ఎన్టీఆర్ విధ్వంసం.. గూస్ బంప్స్ గ్యారెంటీ.. రాసుకోండి!

NTR’s Devara Fear Song Out: ఎట్టకేలకు దేవర సాంగ్ వచ్చేసింది. గత మూడు రోజులుగా ఈ సాంగ్ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సైతం రోజుకో పోస్టర్ తో హైప్ పెంచేస్తూ రావడంతో ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. ఇక చివరికి ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మేకర్స్ చెప్పినట్లే ఎన్టీఆర్ విధ్వంసం చూపించాడు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.


కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ అంచనాలను పెంచేయగా.. ఈ సాంగ్ ఆ అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అనగానే అసలు మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

అగ్గంటుకుంది సంద్రం భగ్గున మండె ఆకసం.. అరాచకాలు భగ్నం అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం అలరిస్తుంది. సముద్రం ఒడ్డున ఎన్టీఆర్ సృష్టించిన విధ్వంసం సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. దేవర క్యారెక్టర్ ను లిరిక్స్ రూపంలో రాసి అదరగొట్టేశాడు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత అనే లైన్ అయితే అసలు సాంగ్ మొత్తానికే హైలైట్.


Also Read: Twist in Rave Party: అమ్మ దొంగ.. దొరికిపోయిన నటి హేమ.. అదిరిన బెంగుళూరు పోలీసుల ట్విస్ట్..!

ఫియర్ సాంగ్ అంటే.. అభిమానులను భయపెడతారేమో అనుకున్నారు కానీ, ఆ భయానికే భయం చూపించేలా ఉంది ఈ లిరిక్స్, అనిరుధ్ మ్యూజిక్.. ఎన్టీఆర్ అరాచకం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.. సాంగ్ విన్న అభిమానులు ఎన్టీఆర్ విధ్వంసం.. గూస్ బంప్స్ గ్యారెంటీ.. రాసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×