Jabardasth Fiama Introduced Lover on Her Birthday: డీజే టిల్లు చూసాకా.. అబ్బాయిలందరూ ఫీల్ అయ్యింది ఒక్కటే. రాధికా లాంటి అమ్మాయిలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఒకరిని ప్రేమించి.. వారిని వదిలేసి మరొక అబ్బాయితో ప్రేమాయణం నడిపి.. చివరికి ఇంట్లో చూపించిన పెళ్లి చేసుకుంటారు. ఇక అందరు అమ్మాయిలు అలా ఉంటారని చెప్పలేము కానీ కొంతమంది అమ్మాయిలు అలాగే ఉన్నారని అబ్బాయిలు కచ్చితంగా చెప్పుకొస్తున్నారు.
అసలు ఈ మ్యాటర్ ఇప్పుడెందుకు అంటే.. జబర్దస్త్ ఫైమాను కొంతమంది ఒరిజినల్ రాధిక అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం.. ఫైమా నేడు తన లవర్ ను పరిచయం చేయడమే. అందులో తప్పేముంది ఫైమా ప్రేమించింది ప్రవీణ్ నే కదా అని అనుకోకండి. అదంతా తూచ్ అంటా.. ఫైమా ప్రేమించిన అబ్బాయి వేరు. నేడు ఆ అబ్బాయిని పరిచయం చేసి షాక్ ఇచ్చింది. పటాస్ షోతో ఫైమా ఇండస్ట్రీకి పరిచయమైంది. తనదైన కామెడీ, మ్యానరిజంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
ఇక జబర్దస్త్ లోనే ప్రవీణ్ తో లవ్ ట్రాక్ నడిపింది. అయితే అది రీల్ కాదు రియల్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అంతెందుకు బిగ్ బాస్ షోకువెళ్ళినప్పుడు స్టేజిమీదనే ఫైమా.. ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఏం జరిగిందో తెలియదు.. వీరిద్దరూ విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.
Also Read: Actress Yami Gautham: శుభవార్త.. మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్
తల్లిదండ్రులు లేరని, సింపతీ చూపిస్తూ ప్రవీణ్ తనను నెగటివ్ చేశాడని ఫైమా చెప్పగా.. హౌస్ నుంచి బయటకు వచ్చాకా ఆమె మారిపోయింది.. నాతో అస్సలు మాట్లాడమే మానేసిందని ప్రవీణ్ చెప్పాడు. ఇక కట్ చేస్తే.. నేడు ఫైమా పుట్టినరోజు. ఈరోజున తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ అని అధికారికంగా చెప్పుకొచ్చింది. అతడితోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకొని షాక్ ఇచ్చింది.
ఇక సదురు ప్రవీణ్ నాయక్ కూడా ఫైమా నా లవ్.. మేమిద్దరం ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. జీవితం మొత్తం నీతో కలిసి ఉండాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. ఇప్పటివరకు రాధిక అంటే డీజే టిల్లులోనే ఉందని అనుకున్నాం.. మొదటిసారి ఒరిజినల్ గా చూస్తున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.