Big Stories

Chandrababu: ఏపీ ఎన్నికల్లో క్లాస్ వార్ కాదు.. క్యాష్ వార్ జరుగుతోంది: చంద్రబాబు

Chandrababu: పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంత శాతం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పెద్దిరెడ్డిని రాజకీయంగా భు స్థాపితం చేస్తామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని.. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు హెచ్చరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని ప్రజలకు వెల్లడించారు. పుంగనూరుకు ఇవాళే స్వాతంత్య్రం వచ్చిందని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

మామిడి కాయల కొనుగోలులో కూడా పెద్దిరెడ్డి కమిషన్లు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే అని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబమంతా కలిసి రూ.30వేల కోట్లు కొట్టేశారని విమర్శించారు. అమాయకపు ప్రజలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని అన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన అవినీతిని కక్కించి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఏపీలో ఉత్తర కొరియా మాదిరిగా కిమ్(జగన్) ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు క్యాస్ వార్ కాదని క్యాష్ వార్ అని అన్నారు.

వైసీపీ నేతలు ప్రజల వద్ద నుంచి దోచుకున్న డబ్బును వసూలు చేస్తామని చంద్రబాబు అన్నారు. గతంలో వైసీపీ కేసుల మాఫీ కోసం ఎన్డీఏ ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకుందని.. అయితే తాము మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.

నల్లారి కుటుంబానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని.. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డికి, పాపాల పెద్దిరెడ్డికి పోలికేంటని చంద్రబాబు అన్నారు. పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు అని చంద్రబాబు వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయితే.. పెద్దిరెడ్డికి నిద్ర అనేది పట్టదని విమర్శించారు. అతని ఆధిపత్యానికి కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెడతారనే భయం ఉందన్నారు.

Also Read: షర్మిల సంచలన కామెంట్స్, వివేకా హత్య, ఆపై 40 కోట్లు

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారని అన్నారు. చివరికి చెత్తపై కూడా పన్ను వసూలు చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. వైసీపీ దోచుకున్న అవినీతి సొమ్మును కక్కించి.. జూన్ 4 తర్వాత ప్రజలకు పంచపెడతామని చంద్రబాబు వెల్లిడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News