BigTV English

Yakuza Karishma Mini Electric Car: రూ.లక్ష 75 వేలకే ఎలక్ట్రిక్ కారు.. దీని దెబ్బకి బైకులు మాయం..!

Yakuza Karishma Mini Electric Car: రూ.లక్ష 75 వేలకే ఎలక్ట్రిక్ కారు.. దీని దెబ్బకి బైకులు మాయం..!

Yakuza Karishma Larunching Electric Car With Rs 1 Lakh 75 thousand Price: టాటా కంపెనీకి చెందిన నానో కారు అందరికీ  గుర్తుండే ఉంటుంది. ఇది చోటా కారు పేరుతో చాలా ప్రజాదరణ పొందింది. ఈ కారు  ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై కంపెనీ నుండి ఎటువంటి నిర్ధారణ రాలేదు. అయితే ఇంతలోనే టాటా నానో లాగా కనిపించే యాకుజా “కరిష్మా” EV దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కారు బైక్ కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మీరు పెట్రోల్, డీజిల్ కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా నగరాల్లోని ప్రజలు ఇప్పుడు పెట్రోల్-డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నారు.


కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికీ సాధారణ వాహనాల కంటే కొంచెం ఖరీదైనవిగా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు యకూజా కంపెనీ “కరిష్మా” అనే చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ వాహనం తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.

Also Read: కారు లవర్స్‌కు కియా బిగ్ గిఫ్ట్.. ఇకపై అద్దెకు కొత్త కార్లు!


ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కారు డిజైన్ చాలా ఆధునికంగా ఉంది. ఇందులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే హెడ్‌లైట్‌ల పైన మెరిసే నల్లటి గ్రిల్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs). హెడ్‌లైట్‌లు రెండు హాలోజన్ బల్బులను కలిగి ఉంటాయి. అదనంగా రెండు హెడ్‌లైట్‌లను కలుపుతూ మధ్యలో LED DRL కూడా ఉంది. ఇది చాలా చిన్న కారులా కనిపిస్తుంది. కారు వెడల్పు కూడా ఎక్కువ కాదు. దానికి రెండు డోర్లు మాత్రమే ఉన్నాయి.

యాకుజా కరిష్మా మినీ ఎలక్ట్రిక్ కారు సగటు బైక్ కంటే చౌకగా ఉంటుంది. యాకూజా కరిష్మా ధర దాదాపు రూ.లక్ష 75 వేలు మాత్రమే. ఈ కారులో సులభంగా 3 మంది కూర్చోవచ్చు. దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50-60 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. కారు టైప్-2 ఛార్జర్ కనెక్షన్‌ను కలిగి ఉంది. తద్వారా ఇంట్లో సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

Also Read: టీవీఎస్ ఐక్యూబ్ Vs ఓలా S1.. రెండిటిలో ఏది బెస్ట్? రేంజ్ దేనిలో ఎక్కువ?

ఇది 6 నుండి 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. మీరు Yakuza అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ కారు నగరంలో తక్కువ దూర ప్రయాణం కోసం ఆర్థిక, పర్యావరణ అనుకూల వాహనం కోసం చూస్తున్న వారికి గొప్ప ఎంపిక. సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×