Big Stories

Rice: బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటే చాలా మంచిదట.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Rice For Breakfast: బ్రేక్ ఫాస్ట్ తోనే మనలో చాలామంది రోజు ప్రారంభం అవుతుంది. అల్పాహారం అంటే ఇడ్లీ, వడ, పూరీ, దోస వంటివి అని మనకు తెలుసు. కానీ ఉదయం టిఫిన్స్ కు బదులుగా అన్నం తినే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఉదయాన్నే అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు తక్కువే గానీ.. అంతకు మించి బోలేడు లాభాలు ఉన్నాయి. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

అన్నంలో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా అన్నం తింటే రోజంతా యాక్టీవ్ గా ఉంటాం.దీంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు తగ్గుతాయి. అన్నంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి DNA ను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.

- Advertisement -

మెదడుకు శక్తిని అందించడంలో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తినడం వల్ల ఏకాగ్రతతో ఆలోచిస్తామని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యం అన్నం తినడం వల్ల మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందట. అంతే కాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

అన్నం జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. అన్నం తినడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోను శరీరంలో విడుదలవుతుంది. దీనిద్వారా మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు అనారోగ్యం తగ్గుతుంది.బియ్యంలో ఉండే విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం వంటి విటమిన్లతో పాటు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Also Read: మీరు ప్రతి రోజూ తినే బియ్యం మంచివేనా.. క్వాలిటీ ఎలా చెక్ చేయాలో తెలుసా?

2002 లో The new england journal of medicine లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం అన్నం ఎక్కువగా తినేవారు గుండెజబ్బులతో మరణించే ప్రమాదం 17% తక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో హాడ్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పోషణ విభాగంలో ప్రొఫెసర్ డేవిడ్ పాల్గొన్నారు. అన్నం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతే కాకుండా తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News