BigTV English

Free Food In Train: బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు.. ఈ రైల్లో తిన్నంత ఫుడ్ ఫ్రీ!

Free Food In Train: బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు.. ఈ రైల్లో తిన్నంత ఫుడ్ ఫ్రీ!

Indian Railways: 

రైల్లో ప్రయాణించే సమయంలో ఫుడ్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవాలి. గతంలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి కూడా వేడి వేడి ఫుడ్ తెప్పించుకుని తినొచ్చు. అయితే, వీటన్నింటికీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  లేదంటే, ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి కాంప్లిమెంటరీగా ఉచిత భోజనం అందిస్తారు. సాధారణంగా ఈ ఫుడ్ ఏసీ, స్లీపర్ క్లాసు ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనరల్ కోచ్ లలో ప్రయాణించే వాళ్లు తక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. కానీ, ఏసీ, స్లీపర్, జనరల్ అనే తేడా లేకుండా ప్రయాణీకులందరికీ ఉచితంగా ఫుడ్ అందించే ఓ రైలు ఉంది. ఇంతకీ అది ఇండియాలో ఏ రైట్ లో నడుస్తుందంటే..?


దేశంలో ఫ్రీ ఫుడ్ అందించే ఏకైక రైలు!

ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే ఏకైక రైలు సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్‌(నెంబర్ 12715). ఈ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లు భోజనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే, ఇందులో ప్రయాణించే వారందరికీ ఫ్రీగా ఫుడ్ అందిస్తారు. దశాబ్దాలుగా ఈ రైలులో ప్రయాణీకులకు భోజనం వడ్డించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ రైలు తన ప్రయాణంలో మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో ఆరు స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. ప్రయాణీకులు ఆహారాన్ని తినేందుకు వీలుగా రైలు అవసరం అయినతం సేపు ఆగుతుంది.

అమృత్ సర్- నాందేడ్ మధ్య సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్‌ ప్రయాణం

సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్ పంజాబ్ లోని అమృత్‌ సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు రెండు ముఖ్యమైన సిక్కు మత ప్రదేశాలను కలుపుతుంది. అమృత్‌ సర్‌ లోని శ్రీ హర్మందిర్ సాహిబ్,  నాందేడ్‌ లోని శ్రీ హజుర్ సాహిబ్ హరిద్వారాలను లింక్ చేస్తుంది. ఈ ప్రయాణం 2,081 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రయాణ సమయంలో 6  స్టేషన్లలో ఉచితంగా భోజనం అందిస్తారు. రైలులో ప్యాంట్రీ ఉన్నప్పటికీ, ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రతి ఒక్క ప్రయాణీకుడికి భోజనం అందిస్తారు.


మూడు దశాబ్దాలుగా ఉచిత భోజనం

గత మూడు దశాబ్దాలుగా ఈ రైలు తన ప్రయాణీకులకు ఉచితంగా భోజనం అందిస్తున్నది. ఏసీ, స్లీపర్ క్లాసులతో పాటు జనరల్ కోచ్ లో ప్రయాణించే వారికి కూడా తిన్నంత భోజనం అందిస్తారు. కధీ- చావల్, పప్పు, కూరగాయలతో కూడిన భోజనాన్ని అందిస్తారు. ప్రతిరోజూ సుమారు 2,000 మందికి ఈ ఆహారం అందిస్తారు. ఈ సంప్రదాయం 1995లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉచిత ఆహారం అందిస్తున్నారు. దేశంలో ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే రైలుగా సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. సిక్కు మతస్తులు అందించే విరాళాల ద్వారా ఉచిత ఆహార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్‌ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?

Related News

Tallest Bridge Restaurant: చైనాలో అతి ఎత్తైన వంతెన.. దాని పొడవైన స్తంభాలపై రెస్టారెంట్.. జూమ్ చేస్తేనే చూడగలం!

High Speed Train: విమానంలా దూసుకెళ్లే రైలు.. లోపల చూస్తూ కళ్లు చెదిరిపోతాయ్!

Passport Check: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్‌ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?

Bullet Train: రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!

Falaknuma Express: మిర్యాలగూడలో ఆగిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, కారణం ఏంటంటే?

Vande Bharat Train: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!

Trains Cancelled: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Big Stories

×