Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కారుకు ఘోర ప్రమాదం(Car Accident) జరిగింది. ఈ ప్రమాదంలో భాగంగా కారు మొత్తం నుజ్జు నుజ్జు కావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కారుకు ముందు వెళ్తున్న బొలోరో వాహనం ఉన్నఫలంగా కుడి వైపుకు టర్న్ చేయటంతో వెనుకనే వస్తున్న హీరో విజయ్ దేవరకొండ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కారు ప్రమాదానికి గురికావడంతో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు వేరే కారులో హైదరాబాద్ వెళ్ళిపోయారు. నిశ్చితార్థం తరువాత విజయ్ దేవరకొండ పుట్టపర్తికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్క సారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భాగంగా కారు ఒకవైపు పూర్తిగా డామేజ్ అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ నటి రష్మిక(Rashmika)తో నిశ్చితార్థం (Engagment)జరుపుకున్నారని అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో తన కారుకు ప్రమాదం జరిగిందనే విషయం అందరినీ ఎంతగానో కలవర పెట్టింది. ఇక ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ క్షేమంగా బయటపడ్డారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు మరొక కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే ఈయన ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతంగా చేసుకున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక మందన్న నటించడం విశేషం. ఇక ఈ సినిమాతో పాటు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు . అయితే విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరగడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాతే ఈయన తదుపరి షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్ల సమాచారం.
Also Read: Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!