OTT Movie : హాలీవుడ్ నుంచి ఎన్నో అద్భుతమైన హారర్ సినిమాలు వస్తున్నాయి. వీటిని ఓటీటీలో చూసి తరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. షాకింగ్ ట్విస్టులు, ఒళ్ళు జలదరించే సన్నివేశాలతో చివరి వరకు టెన్షన్ పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా థియేటర్లలో పరుగులు పెట్టించింది. ఈ కథ ఒక పెద్ద మాన్షన్ లో జరుగుతుంది. ఇక్కడ ఒక తల్లి తన పిల్లలను రక్షించడానికి ట్రై చేస్తూ, ఇంట్లో వచ్చే విచిత్ర సంఘటనల నుంచి ఎదుర్కుంటుంది. అయితే ఈ హారర్ స్టోరీలో వచ్చే క్లైమాక్స్ కి ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది అదర్స్’ (The others) 2001లో వచ్చిన హాలీవుడ్ హారర్ మిస్టరీ సినిమా. అలెజాండ్రో అమెనాబర్ దీనికి దర్శకత్వం వహించారు. గ్రేస్ (నికోల్ కిడ్మాన్) ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా 2001 ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. 1 గంట 44 నిమిషాల నిడివితో IMDbలో 7.6/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.
ఈ కథ 1945లో జెర్సీ అనే ఐలాండ్‌లో జరుగుతుంది. గ్రేస్ తన ఇద్దరు పిల్లలు అన్నే, నికోలస్‌లతో ఒక పాత మాన్షన్ లో నివశిస్తుంటుంది. అయితే ఆమె పిల్లలకు ఒక రేర్ డిసీజ్ ఉంటుంది. వాళ్ళు సూర్యకాంతి తగిలితే చనిపోతారు. అందుకే ఇల్లు ఎప్పుడూ చీకటిగా, కర్టెన్స్ మూసి ఉంచుతారు. గ్రేస్ భర్త రెండో ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళి తిరిగి రాకపోవడంతో, అతను చనిపోయాడని ఆమె అనుకుంటుంది. ఒక రోజు, ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ అందరూ కనిపించకుండా పోతారు. వాళ్ళ ప్లేస్ లో కొత్తగా మిల్స్, మిస్టర్ టటిల్, లిడియా అనే ముగ్గురు సర్వెంట్స్ వస్తారు. అదే సమయంలో, అన్నే ఇంట్లో ఇంకెవరో ఉన్నారని అనుమానిస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో విచిత్రమైన సౌండ్స్, ఫుట్‌స్టెప్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్స్ వీళ్ళను భయపెడుతుంటాయి.
ఇంట్లో ఈ ముగ్గురు పనివాళ్ళు వచ్చాక, విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. పిల్లలు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. దీంతో గ్రేస్ సర్వెంట్స్ మీద డౌట్ పడుతుంది. మిల్స్ ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నే, నికోలస్ చాలా భయపడుతుంటారు. గ్రేస్ ఇంటిని లాక్ చేసి, పిల్లలను సేఫ్‌గా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఒక రోజు గ్రేస్ బయట పొగమంచులో ఒక వ్యక్తిని చూస్తుంది. అతను ఆమె భర్త చార్లెస్‌లా ఉంటాడు. చార్లెస్ ఇంటికి వస్తాడు, కానీ విచిత్రంగా ఉంటాడు. అంతే త్వరగా వెళ్లిపోతాడు. క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. ఇక్కడ గ్రేస్, ఆమె పిల్లలు, సర్వెంట్స్ అందరూ దెయ్యాలు. వాళ్లు చనిపోయి చాలా కాలం అయ్యింది. గ్రేస్ గతంలో తన పిల్లలను చంపి, తనను తాను కూడా చంపేసుకుందని తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఒక కొత్త లివింగ్ ఫ్యామిలీ ఉంటుంది. స్టోరీ ఇక అటు తిరుగుతుంది. గ్రేస్ ఎందుకు తన పిల్లలను చంపుకుంది ? ఆ ఇంట్లో వాళ్ళు దెయ్యాలుగా ఎందుకు మారారు ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా