BigTV English

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!


OG Movie OTT Release Details: మొన్నటి వరకు ఓజీ ఫీవర్మామూలుగా లేదు. సెప్టెంబర్‌ 25 ముందు ఎక్కడ చూసిన ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్అంత హంగామా చేసింది. ఇక సోషల్ మీడియా మొత్తం ఓజీ పోస్టర్సే. అంత హైప్క్రియేట్చేసింది సినిమా. సుజీత్దర్శకత్వంలో, పవన్కళ్యాణ్గ్యాంగ్స్టర్గా నటించిన చిత్రం సెప్టెంబర్‌ 25 వరల్డ్వైడ్గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీసు రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లల్లోనే చిత్రం రూ. 250 పైగా కోట్ల గ్రాస్వసూళ్లు చేసి రికార్డు బ్రేక్చేసింది. ఇక పదకొండు రోజుల్లో వరల్డ్వైడ్గా ఓజీ రూ. 308 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఏడాది హయ్యేస్ట్గ్రాసర్‌..

అంతేకాదు ఏడాది హయ్యేస్ట్గ్రాస్సాధించిన తొలి తెలుగు సినిమాగా ఓజీ అరుదైన ఘనత సాధించిందంటూ మూవీ టీం తాజాగా ప్రకటించింది. అయితే ఇదంత బయటకు కనిపించేది మాత్రమే అంటున్నాయి ట్రేడ్వర్గాలు. సినిమా కలెక్షన్స్టాక్కి భిన్నంగా ఉన్నాయని, మూవీ చెబుతున్నంత హైప్‌, బజ్థియేటర్లలో కనిపించడం లేదంటూ యాంటి ఫ్యాన్స్ కామెంట్స్చేస్తున్నాయి. ఫ్యాన్స్విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం వర్గం ఆడియన్స్పెద్దగా మెప్పించలేదని టాక్‌. హిట్టాక్వచ్చినా.. సినిమాలో పెద్దగా కథ లేదని, ఓజీని డైరెక్షన్పెద్దగా ఆకట్టుకోలేదు అంటున్నారు. సినిమా పవన్నటన, తమన్బ్యాగ్రౌండ్స్కోర్మాత్రమే నిలబెట్టిందనేది యాంటి ఫ్యాన్స్వాదన. ఏదేమైనా.. పవన్కెరీర్మాత్రం హయ్యేస్ట్ గ్రాస్మూవీ పడింది. విషయంలో మెగా, పవర్స్టార్ఫ్యాన్స్మాత్రం ఫుల్హ్యాపీ.


నెల రోజుల్లోనే

ప్రస్తుతం థియేటర్లలలో సక్సెస్ఫుల్గా రన్అవుతున్న మూవీ ఓటీటీ రిలీజ్కి సంబంధించిన తాజాగా అప్డేట్బయటకు వచ్చింది. బ్లాక్బస్టర్విజయం సాధించిన చిత్రం నెల రోజులోపే ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్బజ్ప్రకారం.. ఓజీ మూవీ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు చేస్తుంది. విడుదలై రెండు వారాలు అవుతున్న వసూళ్లు మాత్రం బాగానే రాబడుతుంది. పదకొండు రోజుల్లో చిత్రం వరల్డ్వైడ్గా రూ. 308 కోట్లకు పైగా కలెక్షన్స్చేసింది. భారీ విజయం సాధించిన సినిమా ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్కోసం అప్డేట్వచ్చింది. దీపావళి కానుకగా మూవీ ఓటీటీలోకి రాబోతుందట.

Also Read: OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

మేకర్స్తో చర్చలు..

కాగా సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూవీకి వస్తున్న హైప్చూసి విడుదలకు ముందే ఓజీ ఓటీటీ ఢీల్క్లోజ్ అయ్యింది. నిజానికి ఒప్పందం ప్రకారం సినిమా రెండు నెలల తర్వాతే ఓటీటీకి రావాలి. కానీ, ఓజీ మూవీ థియేట్రికల్మెల్లి మెల్లిగా డౌన్అవుతుంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ఇచ్చిన చిత్రం కలెక్షన్స్రెండో రోజుకే భారీగా పడిపోయాయి. అయితే ఇప్పుడు కాంతార: చాప్టర్‌ 1 కూడా విడుదల కావడంతో ఓజీ కలెక్షన్స్లో డ్రాప్కనిపించింది. దీంతో సినిమా ఓటీటీ రిలీజ్ఇంకాస్తా ముందుకు తీసుకువచ్చారట మేకర్స్‌. దీపావళి పండుగా సందర్బంగా ఓజీ చిత్రాన్ని డిజిటల్ప్రీమియర్కి ఇవ్వాలని నెటిఫ్లిక్స్భావిస్తోందట. దీనిపై ప్రస్తుతం మూవీ మేకర్స్చర్చలు జరుగుతున్నాయట. అంత ఒకే అయితే అక్టోబర్‌ 23 నుంచి OG చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్రానుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్చేయాల్సిందే.

Related News

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

Big Stories

×