
Amala Paul (Source: Instragram)
అమలాపాల్.. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.

Amala Paul (Source: Instragram)
మొదట దర్శకుడిని వివాహం చేసుకున్న ఈమె.. అతడితో విభేదాలు రావడంతో మరొక వివాహం చేసుకొని ఇప్పుడు పండంటి కొడుకుకు జన్మనిచ్చి తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

Amala Paul (Source: Instragram)
వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఎత్తైన గోడ ఎక్కి విన్యాసాలు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

Amala Paul (Source: Instragram)
అమలాపాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆ విన్యాసాలు ఏంటి? కాస్త చూసుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Amala Paul (Source: Instragram)
ప్రస్తుతం అమలాపాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులలో కాస్త కంగారును కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో మనసును హత్తుకుంటున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Amala Paul (Source: Instragram)
అమలాపాల్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో విపరీతంగా ఆకట్టుకుంటుంది.