Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. 8వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మరింత హీట్ ఎక్కింది అని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్స్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్ ని మళ్ళీ హౌస్ లోకి పిలిపించి, వారి చేత నామినేషన్స్ చేయించారు. అందులో భాగంగానే మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి అనే ముగ్గురు కామనర్స్ తో పాటు భరణి శంకర్ , ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ ను వ్యాలీడ్ పాయింట్స్ తో నామినేట్ చేశారు. ముఖ్యంగా భరణి శంకర్ కచ్చితమైన పాయింట్స్ బయటకు తీస్తూ అటు సంజనకు చెమటలు పట్టించారు.
మరి ఈ నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగింది? అనే విషయానికి వస్తే.. తాజాగా 51వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ప్రోమో స్టార్ట్ అవ్వగానే భరణి శంకర్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆయనను చూడగానే దివ్య నిఖిత సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంది. ఆ తర్వాత భరణి శంకర్, ఇమ్మానుయేల్ ని చూస్తూ కట్టప్ప అదరగొట్టేసావుగా.. చంపేసావుగా అమరేంద్ర బాహుబలి నీ.. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప అంటూ హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత శ్రష్టి వర్మ హౌస్ లోకి అడుగుపెట్టింది.
నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.. భరణి శంకర్ సంజనను నామినేట్ చేస్తూ. నన్ను అన్నా అని పిలిచినా.. భరణి అన్నా అని మీరు పిలిచినప్పుడల్లా నేను మిమ్మల్ని సిస్టర్ గానే భావించాను. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు కూడా ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు. అని భరణి శంకర్ అనగా దానికి సంజన మాట్లాడుతూ.. మీరు ఇక్కడున్న రిలేషన్ వల్లే బయటకు వెళ్లారని అందరికీ తెలుసు కదా అంటూ తన వాయిస్ వినిపించింది. నీ వరకు వచ్చే వరకు రూల్స్ బయట హౌస్ మేట్స్ కి వచ్చేసరికి మీకు రూల్స్ ఉండవు. అని భరణి చెబుతుండగానే మీరు గ్రూప్ ఇజం పెట్టుకొని నన్ను పెంట పెంట చేసేసారు అంటూ తన వాదన వినిపించింది. ఇక గ్రూప్ ఇజం మేము ఎక్కడ పెట్టాము .. ఎవరెవరు అని అడగగా తనూజ.. దివ్య.. రాము అని అందరి పేర్లు చెబుతుండగా అదే రాము నన్ను టాస్క్ లో నుండి తీసేసాడు కదా అంటూ భరణి తెలిపారు.
ALSO READ:Bigg Boss 9: మాధురి ఎలిమినేషన్.. వెనుక ఇంత కథ ఉందా?
తర్వాత శ్రష్టి వర్మ పవన్ ను నామినేట్ చేస్తూ బుద్ధిబలం లేదు అంటూ కామెంట్ చేసింది. రీతూ చౌదరికి ఉన్న క్లారిటీ నీకు లేదు అంటూ పవన్ ను నామినేట్ చేస్తూ తన వాదనలు వినిపించింది. అలాగే ఎవరికివారు తమ వాదనలు వినిపిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక భరణి చెప్పిన వ్యాలీడ్ పాయింట్స్ అందరిని మెప్పించాయి. రేలంగి మామయ్యగా పేరు తెచ్చుకున్న భరణి ఎలిమినేట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.