BigTV English
Advertisement

Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల జాప్యం.. చిత్రపురి కాలనీ ఆస్తులతో లింకులు?

Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల జాప్యం.. చిత్రపురి కాలనీ ఆస్తులతో లింకులు?

Film Chamber : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లోకి వస్తుంది. కారణం.. ఎన్నికలు అంటే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్… ససేమిరా అంటున్నాడు. ఈ ఏడాది జూలై 31కే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం పదవీ నుంచి దిగిపోవాలి. కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు జరగాలి. కానీ, ఫిల్మ్ ఛాంబర్‌కు ఇప్పుడున్న అధ్యక్షుడు ఎన్నికల పేరే ఎత్తడం లేదు. ఎవరైనా ఎన్నికలు అంటే… వాయిదా వేయాల్సిందే అంటూ పట్టుపట్టుకుని కూర్చున్నాడు.


అయితే ఈ ఎన్నికల వాయిదా, ఎన్నికల జాప్యం వెనకాల చిత్రపురి కాలనీ ఆస్తులతో లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…

TFCC (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) రూల్స్ ప్రకారం… ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి కొత్త ప్రెసిడెంట్‌తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. గత 30 ఏళ్లల్లో ఇదే రూల్ నడుస్తుంది. అప్పట్లో… రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓ సారి… కరోనా టైంలో రెండో సారి మాత్రమే… ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను వాయిదా వేసి… గతంలో ఉన్న కార్యవర్గాన్నే కంటీన్యూ చేశారు.


వాయిదా వేయాలనే డిమాండ్

అప్పుడంటే ప్రత్యేక పరిస్థితులు కాబట్టి వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. అంతా సజావుగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఎన్నికలను వాయిదా వేయాలని ఇప్పుడున్న ప్రెసిడెంట్ అంటున్నాడో చాలా మందికి అర్థం కావాడం లేదు.

అయితే వస్తున్న సమాచారం ప్రకారం… ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల వాయిదా వేయాలనే డిమాండ్ వెనకాల చిత్రపురి కాలనీ ఆస్తులకు లింక్స్ ఉన్నాయంట. ఆ ఆస్తుల లింక్స్ వల్లే… ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను వాయిదా వేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారంట.

చిత్రపురి కాలనీ ఆస్తులతో లింక్స్ ?

గతంలో చిత్రపురి కాలనీ సోసైటీ ఓ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంది. తర్వాత ఆ లోన్ తీర్చడానికి ప్రముఖ ఫైనాన్సియర్ చదలవాడ శ్రీనివాస రావు సాయం చేశాడు. దాదాపు 25 కోట్ల వరకు చిత్రపురి కాలనీ సోసైటీ బ్యాంక్ లోన్‌కు ఇచ్చారంట. ఈ వ్యవహారం అంతటికి… ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న భరత్ భూషణ్ మధ్యవర్తిత్వం చేశారంట.

అప్పుడు భరత్ భూషణ్ మధ్యవర్తిత్వం చేశారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు జరిగితే, కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. అలా జరిగితే… 25 కోట్ల వ్యవహారం ఇబ్బందుల్లో పడుతుంది. అందు వల్లే… ఎన్నికలు జరగకుండా ఆపేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

నిర్మాణం పూర్తి అయితే…

ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేస్తే.. ఇప్పుడు ఉన్న కార్యవర్గాన్నే కంటీన్యూ చేస్తే… చిత్రపురి కాలనీ సోసైటీ ఇప్పుడు నిర్మిస్తున్న సఫైర్ సూట్ అనే బిల్డింగ్ పూర్తి చేయాలి. సఫైర్ సూట్ 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్న 45 అంతస్తుల బిల్డింగ్. దీనికి దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సఫైర్ సూట్ బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ అయితే… చిత్రపురి కాలనీ సోసైటీ దగ్గర డబ్బులు ఉంటాయి. అప్పుడు.. చదలవాడ శ్రీనివాస రావుకు ఇవ్వల్సిన 26 కోట్లు ఇచ్చేస్తారు. అప్పుడు ఈ వ్యవహారం నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫ్రీ అవుతుంది. అప్పుడు ఎన్నికలు పెట్టుకోవచ్చు అని ఇప్పుడున్న ప్రెసిడెంట్ భావిస్తున్నారు. ఈ లోపు ఎన్నికలు జరిగితే ఆ 25 కోట్ల వ్యవహారం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే ఫిల్మ్ ఛాంబర్‌లో ఎప్పుడూ లేనంత ఇంత గందరగోళం చోటుచేసుకుంటుంది.

సేవ్  ఫిల్మ్ ఛాంబర్..

ఇదిలా ఉండగా… నిన్న పలువురు నిర్మాతలు, నటులు సేవ్ ఫిల్మ్ ఛాంబర్.. బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ అంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద  క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో బడా నిర్మాత సురేష్ బాబుతో పాటు సీనియన్ నటుడు, నిర్మాత మురళీ మోహన్, శివాజీ రాజా, జెమినీ కిరణ్ , అశోక్ కుమార్ , ఏడిద రాజా, బసిరెడ్డి , విజయేందర్ రెడ్డి, నరసింహారావు , శివనాగేశ్వరరావు , చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. గత 30 ఏళ్లగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్‌ను కూల్చొద్దు అంటూ నినాదాలు చేశారు.

Related News

Suryakantham: గయ్యాళి అత్తనే భయపెట్టిన మహిళ.. నడిరోడ్డుపై కడిగిపారేసిందిగా!

Fauzi Movie: ‘ఫౌజీ’లో జూనియర్‌ ప్రభాస్‌గా ఘట్టమనేని వారసుడు..

HBD Aditi Rao Hydari :అదితి రావు – సిద్దార్థ్ లగ్జరీ ఇంటిని చూశారా..? ప్రత్యేకతలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Rashmika Manadanna: రష్మికకు ఏం జరిగింది.. ట్రీట్మెంట్ ఎందుకు..? టెన్షన్ లో ఫ్యాన్స్..

Kantara Chapter 1 : కాంతార ఇక్కడ హిట్.. అక్కడ డిజాస్టర్.. భారీ నష్టం..

Boyapati Srinu : డైరెక్టర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజం..

Tollywood : ఐరన్ లెగ్ శాస్త్రి అలాంటివాడా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!

Big Stories

×