BigTV English
Advertisement

Foamy Urine: మూత్రంలో నురుగ వస్తుందా? అయితే, డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే!

Foamy Urine: మూత్రంలో నురుగ వస్తుందా? అయితే, డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే!

సాధారణంగా చాలా మంది మూత్రం పోసే సమయంలో కాస్త నురుగ వస్తుంది. చిన్ని చిన్న బుడగలు కనిపిస్తాయి. ఈ బుడగలు కాసేపట్లోనే వాటర్ లో కలిసిపోతాయి. లేదంటే, గాలికి మాయం అవుతాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, కొంత మందిలో నురగ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నురగ చాలా మందంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బీరు నురగలా అనిపిస్తుంది. మందంగా, తెల్లగా ఉంటుంది. ఫ్లష్ చేసిన తర్వాత కూడా చాలా సేపు నీటి పైన నురగ ఉంటుంది. ఇలాగే పదే పదే జరిగితే.. అది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చంటున్నారు వైద్యులు.


మూత్రంలో నురుగ ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

మూత్రంలో నురగ రావడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఇలా రావడానికి కారణం మూత్రంలో  ప్రోటీన్. మూత్రపిండాలు శరీరంలో ఫిల్టర్ల  లాంటివి. ప్రతిరోజూ అవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలోని మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. సాధారణంగా, రక్తం లోపల ప్రోటీన్ లాంటి ముఖ్యమైన పోషకాలను రాకుండా చేస్తాయి.  వ్యర్థాలు, అదనపు నీటిని మాత్రమే మూత్రంగా బయటకు పంపుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, ఫిల్టర్లలో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. అప్పుడు, ప్రోటీన్ అల్బుమిన్ రూపంలో మూత్రంలోకి లీక్ అవుతుంది. ఈ ప్రోటీన్ సబ్బులా పని చేస్తుంది. మూత్ర విసర్జన చేసినప్పుడు మందమైన నురగను సృష్టిస్తుంది. ఈ పరిస్థితిని ప్రోటీన్యూరియా అంటారు. ఇది మూత్రపిండాల డ్యామేజీకి తొలి సంకేతంగా గుర్తించాలి.

నురగ మూత్రానికి  సాధారణ ఆరోగ్య సమస్యలు!

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి.  నురగ మూత్రానికి దారితీస్తాయి. నురగ మూత్రం రావడానికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ డయాబెటిస్:  ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధికి డయాబెటిస్ ప్రధాన కారణం. రక్తంలో చక్కెర ఎక్కువ కాలం ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల ప్రోటీన్ మూత్రంలోకి లీక్ అవుతుంది. నురగ మూత్రం వస్తుంది.

⦿ అధిక రక్తపోటు: అధిక రక్తపోటు కిడ్నీ ఫిల్టర్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. నెమ్మదిగా ఈ ఒత్తిడి కిడ్నీలను  దెబ్బతీస్తుంది. ఫలితంగా, ప్రోటీన్ బయటకు వెళ్లి నురుగను కలిగిస్తుంది.

⦿ కిడ్నీ ఇన్ఫెక్షన్లు: మూత్రపిండాలకు ఇబ్బంది కలిగించే మరో సమస్య పైలోనెఫ్రిటిస్.  ఇది తాత్కాలిక,  దీర్ఘకాలిక ప్రోటీన్ లీక్‌ కు దారితీస్తుంది.

⦿ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి: మధుమేహం, BP, ఇన్ఫెక్షన్లు మొదలైనవి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు కారణం అవుతాయి. నురుగుతో కూడిన మూత్రం కనిసిస్తుంది.

⦿ ఇతర కారణాలు: గ్లోమెరులోనెఫ్రిటిస్, లూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మల్టిపుల్ మైలోమా, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి కారణాలతోనూ నురగ మూత్రం ఏర్పడుతుంది.

అయితే, నురగ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఈ నురగ హాని చేయకపోవచ్చు. నురగ మరింత తీవ్రంగా వస్తేనే డాక్టర్లను సంప్రదించాలి. లేదంటే.. లైట్ తీసుకోవచ్చు.

Read Also: అర్జంట్ గా వాష్ రూమ్ కు వెళ్లాలా? సింపుల్ గా ఈ యాప్ ఓపెన్ చేస్తే చాలు!

Related News

Chia Seeds: చియా సీడ్స్ తింటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు !

Lemon Water: 30 రోజులు లెమన్ వాటర్ తాగితే.. అద్భుత ప్రయోజనాలు !

Food Allergy: కడుపు నొప్పి వచ్చిందా? ఈ ఆహారాల్లో దేనికో అలెర్జీ కావచ్చు!

Headache: క్షణాల్లోనే.. తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవే !

Guava Fruits: వింటర్ స్టార్ట్.. జామపండు తినకుండా వీళ్లని ఆపాల్సిందే!

Optimal Thyroid : థైరాయిడ్ సమస్యా? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ !

Clove Benefits For Heart: లవంగాలతో గుండెకు మేలు.. ఇలా వాడితే బోలెడు బెనిఫిట్స్

Big Stories

×