Kantara Chapter 1 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం కాంతార చాప్టర్ 1.. గతంలో వచ్చిన కాంతార సినిమాకి ఇది సీక్వెల్ రా వచ్చింది. రిసెప్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీ తోనే డైరెక్టర్ హీరోగా మారాడు. సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాని తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ విషయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈనెల 2 న దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇండియా వైడ్ మంచి కలెక్షన్ లని వసూలు చేసింది. కానీ అమెరికాలో మాత్రం నిరాశను మిగిల్చింది. ఇక్కడ హిట్ అయిన అక్కడ డిజాస్టర్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. యుఎస్ లో ఈ మూవీ కలెక్షన్ల గురించి తెలుసుకుందాం..
కాంతార మూవీ కన్నడ ఇండస్ట్రీని షేర్ చేసింది.. ఈ సినిమాకు సీక్వెల్ అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవడంతో వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి గాంధీ జయంతి దసరా సందర్భంగా ఈనెల రెండున థియేటర్లోకి వచ్చేసింది.. ఈ సినిమాకి ముందుగా క్రియేట్ అయిన అంచనాలకు తగ్గట్లుగానే ఇండియాలో పాజిటివ్ టాక్ తో పాటు భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాదాపు 800 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. అయితే యుఎస్ లో మాత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అనుకున్న దానికంటే చాలా తక్కువ వసూలు అవడంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ లో పడ్డారు. 8 మిలియన్ల డార్లలతో ఈ సినిమాని కొనుగోలు చేశారు.. కానీ ఐదు మిలియన్ల వరకు వసూళ్లను అందుకుంది. సినిమా వచ్చి చాలా రోజులు అవడంతో ఈ సినిమా పైగా ఆశలు వదులుకోవాల్సిందేనని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఏది ఏమైనా సరే మరో మూడు మిలియన్ల డాలర్లను రాబట్టడం కష్టమే. ఇండియాలో హిట్ అయిన ఈ సినిమా యుఎస్ లో మాత్రం డిజాస్టర్ అయినట్లే అని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read : డైరెక్టర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజం..
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఆ రేంజ్ కలెక్షన్లను వసూలు చేయలేదు.. 26 రోజులకు ఈ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చనే అంచనాలు కలిగాయి.. అయితే అది సాధ్యం కాలేదు.. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా అక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇప్పటికే ఓటీటీ లో ఈ సినిమాని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.