సైక్లోన్ మొంథా తీవ్రరూపం దాల్చుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుఫాన్ గా మారింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, పరిసర రాష్ట్రాల్లోనూ తీవ్రంగా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేతో పాటు పలు విమానయాన సంస్థలు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పలు రైళ్లతో పాటు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నాయి. రద్దైన రైళ్లకు సంబంధించి రీఫండ్ ఇవ్వనున్నట్లు రైల్వే ప్రకటించింది.
మొంథా తుఫాన్ కారణంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 150కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటను జారీ చేసింది. పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. ముందుగా 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఆ తర్వాత 75కు పైగా రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయన రైల్వే సంస్థలు కీలక ప్రకటన చేశాయి. ఈ రైళ్ల రద్దు అక్టోబర్ 28, 29, 30 వరకు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మంగళ, బుధ, గురువారం వారాల్లో విశాఖ మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది వెల్లడించారు. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు వెళ్లాల్సిన రైళ్ల వివరాలను తెలుసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావాన్ని బట్టి రైల్వే సర్వీసుల రద్దు, పునరుద్ధరణ చేపడుతామని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రైళ్ల రద్దు, డైవర్షన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్యాన్సిల్ చేసిన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ మెము, ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు తెలిపారు.
@RailMinIndia@EastCoastRail@DRMKhurdaRoad@DRMSambalpur@drmvijayawada@serailwaykol@SCRailwayIndia@secrail
Important train related information. Trains cancelled due to impending cyclone Montha. pic.twitter.com/ICRKSixDNW
— DRMWALTAIR (@DRMWaltairECoR) October 27, 2025
Cancellation of Trains #CycloneMontha trains update @RailMinIndia @drmvijayawada @drmgnt @drmsecunderabad @drmhyb @drmgtl @DRMWaltairECoR @EastCoastRail pic.twitter.com/GovxeUprDs
— South Central Railway (@SCRailwayIndia) October 27, 2025
మొంథా తుఫాన్ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భారతీయ రైల్వే ముందస్తు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది. అందులో భాగంగానే విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. మంగళ, బుధవారాల్లో(అక్టోబర్ 28, 29) బయల్దేరే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల ప్రయాణాలు కొనసాగించే రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే రైళ్ల రద్దుకు సంబంధించి ప్రయాణీకులకు మెసేజ్ ల ద్వారా సమాచారం అందించారు. క్యాన్సిల్ అయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణీకులకు రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అటు మొంథా తుఫాన్ కారణంగా రైళ్లతో పాటు పలు విమానాలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆయా విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి. సోమవారం(అక్టోబర్ 27) రాత్రి విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేశారు. అదే సమయంలో విజయవాడ నుంచి ప్రస్తుతం 46 సర్వీసులు నడుస్తుండగా ఇవాళ వాటిలో 36 సర్వీసులను క్యాన్సిల్ చేశారు. విజయవాడ నుంచి షార్జాకు నడిచే సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. విజయవాడ-విశాఖ, విజయవాడ-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే 18 ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో పాటు ఇతర సంస్థలకు చెందిన 6 సర్వీసులు రద్దయ్యాయి. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇవాళ ఉదయం 9.30గంటల లోపు నడిచే సర్వీసులు మాత్రమే యథావిధిగా నడుస్తాయని అధికారులుత ఎలిపారు. ఆ తర్వాత ముంబై, తిరుపతి, బెంగుళూరు, చెన్నైకి వెళ్లే సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. వైజాగ్ విమానాశ్రయం అధికారులు కూడా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాలకు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. మొత్తంగా 56 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
6ETravelAdvisory
Due to prevailing cyclone conditions and heavy rainfall expected in and around #Vijayawada, #Visakhapatnam and #Rajahmundry, flight operations to and from these cities are affected.
We advise all customers to check their flight status at…
— IndiGo (@IndiGo6E) October 27, 2025
Read Also: బొద్దింకకు ఉరేసిన ఎయిర్ ఇండియా సిబ్బంది.. ఇంతకీ అది చేసిన నేరం ఏంటంటే?