Brahmamudi serial today Episode: రాజ్ ఎలాగైనా మార్చేందుకు కావ్య ట్రై చేస్తుంది. దీంతో రాజ్ కోపంగా కావ్యను తిడుతుంటాడు. దీంతో ఇంట్లో వాళ్లకు వినబడేలా తిట్టండి అంటుంది. ఇంతలో ఇంద్రాదేవి వస్తుంది. ఏమైందని అడుగుతుంది. కావ్య యోగాసనాలు వేస్తుందని చెప్పగానే.. అదేం తప్పు కాదే.. మంచిదే కదా అంటుంది. దీంతో రాజ్ ఇంద్రాదేవిని తిట్టి వెళ్లిపోతాడు.
మరోవైపు అప్పు స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే వెనక నుంచి వచ్చిన కళ్యాణ్ పొట్టి అంటూ హగ్ చేసుకుంటాడు. ఏంటి కూచి పొద్దుపొద్దున్నే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు అయినా ఈ రోజు ఎవరినో ప్రొడ్యూసర్‌ని కలవాలి అన్నావు మర్చిపోయావా అని అడగ్గానే.. మర్చిపోలేదు పొట్టి.. వద్దు అనుకుని వదిలేశాను అని కళ్యాణ్ చెప్పగానే.. అదేంటి ఎందుకు అలా అనుకున్నావు…? అని అప్పు అడుగుతుంది. దీంతో కళ్యాణ్ వదినకు డెలివరీ అయ్యే వరకు అన్నయ్య ఇంట్లోనే ఉంటూ తనను చూసుకుంటానని చెప్పాడు కదా.. మరి ఈ కళ్యాణ్ కూడా అన్నయ్య అడుగుజాడల్లో నడిచేవాడు కదా..? అందుకే నా పొట్టికి కూడా డెలివరీ అయ్యే వరకు తనకు తోడుగా ఉందామని డిసైడ్ అయిపోయాను అంటూ కల్యాణ్ చెప్పగానే..
అన్ని నెలలు నువ్వు నాతో పాటు కూర్చున్నావు అంటే నీ ప్రొడ్యూసర్లు వేరే రైటర్‌ను చూసుకుంటారు.. అని చెప్పగానే.. పోతే పోనీ పొట్టి నాకు నీకంటే ఏమీ ఎక్కువ కాదు.. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా..? ఎటువంటి టెన్షన్లు లేవు దేనికీ భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉంది అని కళ్యాణ్ చెప్పగానే.. నువ్వు చెప్పింది నిజమే కూచి నిన్నటి వరకు అక్క ఆపరేషన్‌కు ఒప్పుకోకపోతే తనను ఎలా కాపాడుకోవాలా అని అందరం చాలా కంగారు పడిపోయాము.. ఏదో చిటికె వేసినట్టు ఆ దేవుడు వరం ఇచ్చినట్టు ఒక్కసారిగా సమస్యలన్నీ తీరిపోయాయి ఇప్పుడు బావగారు కోరుకున్నట్టుగా అక్క సేఫ్.. అక్క కోరుకున్నట్టుగా అక్క కడుపులో బిడ్డ కూడా సేఫ్ నువ్వు అన్నట్టు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. అంటుంది అప్పు. ఆ అలా అంటావేంటి పొట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ముఖ్యంగా రెండు ఉన్నాయి అని చెప్తాడు.. కళ్యాణ్ దీంతో అప్పు అవునా.. ఏంటది..? అని అడగ్గానే.. నీ బుజ్జి పొట్టలోపల రాబోతున్న మన పాప గురించి నీ కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి ఆలోచించాలి కదా అని చెప్పగానే.. పొట్టలో ఉన్న పాప గురించి ఓకే కానీ కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి చూసుకోవడం నా వల్ల కాదు అంటూ వెళ్లిపోతుంది అప్పు.
హాల్లో కూర్చున్న సుభాష్, ప్రకాష్ రాజ్‌ను పిలుస్తారు. ఏమైందని రాజ్ వస్తాడు. దీంతో సుభాష్ నువ్వు వెంటనే ఆఫీసుకు వెళ్లాలి. ఆఫీసు పనులు చూడాలి అని చెప్తాడు. రాజ్ ఇప్పుడా అని అడుగుతాడు. ఇప్పుడేరా అని ప్రకాష్ చెప్తాడు. ఇన్ని రోజులు నువ్వునా లేకపోయినా అన్ని పనులు మేమే చూసుకున్నాం. ఇక మా వల్ల కాదు అంటాడు. మేము మాత్రం ఎన్నాళ్లని ఆఫీసు చుట్టూ తిరుగుతామురా..? అని సుభాష్ చెప్పగానే..అవునురా పాతికేళ్లుగా ఆఫీసుకు అంకితం అయిపోయారు మీ నాన్న బాబాయ్.. ఇకనైనా వాళ్లకు రెస్ట్ ఇవ్వాలి కదా అంటుంది. ఏంట్రా మాట్లాడవు నీ పనులన్నీ అయిపోయాయి కదా ఇంకేంటి ఆలోచన అంటాడు సుభాష్. దీంతో రాజ్ సారీ నాన్న ఇంకొన్ని రోజులు నేను ఆఫీసుకు వెళ్లడం కుదరదు అంటాడు. ఇంతలో ఇంద్రాదేవి ఏరా ఎందుకని ఇప్పుడు నీ కంటూ ఇంట్లో పనులేమున్నాయని.. అని అడుగుతుంది. అది కాదు నాన్నమ్మ ఇంకొన్నాళ్లు నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను.. కళావతి డెలివరీ అయ్యే దాకా నేను తన పక్కనే ఉండాలనుకుంటున్నాను.. అని రాజ్ చెప్పగానే..
కావ్య నాకు తోడుగా ఉండటమేంటి..? నేను బాగానే ఉన్నాను.. మీరు హ్యాపీగా ఆఫీసుకు వెళ్లి రండి అని చెప్తుంది. కలావతి నీకేం తెలియదు కాసేపు నువ్వు ఏం మాట్లాడకు అంటాడు. దీంతో అపర్ణ కోపంగా అదేంట్రా దాన్ని సైలెంట్ గా ఉండమంటావు.. అయినా కావ్యను చూసుకోవడానికి మేమంతా ఉన్నాము కదా అంటుంది. దీంతో రాజ్ మీరు ఉండటం వేరు నేను ఉండటం వేరు. అంటాడు రాజ్. దీంతో ఇంద్రాదేవి ఏరా నీ పెళ్లాన్ని మేము బాగా చూసుకోలేమా..? అంటుంది. అందరూ కలిసి రాజ్‌ను ఆఫీసుకు వెళ్లేలా కన్వీన్స్ చేస్తారు. అయితే రాజ్ కోపంగా కావ్యను ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్‌లో భాగమా అంటాడు. దీంతో అపర్ణ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి..? అని అడగ్గానే.. కావ్య, రాజ్ కంగారు పడతారు. ఇంతలో కావ్య, రాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.
రాహుల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ తినడం స్వప్న, కావ్య చూస్తారు. రాహుల్ ను వెళ్లి నిలదీయమని కావ్య చెప్పినా స్వప్న వద్దని ఇలా చేస్తే మన పరువే పోతుందని వారిస్తుంది. ఇంటికి వచ్చాక రాహుల్ కు బుద్ది చెప్తానని ఇంటికి వెళ్లిపోతారు. తర్వాత కావ్య కలర్‌పుల్‌గా రెడీ అయి రూంలోకి వెళ్లగానే రాజ్ వెళ్తుంటాడు. ఇంద్రాదేవి ఎదురుగా వెళ్లి రాజ్‌ను ఇన్నాళ్లు ఆగావు కదా ఇంకొద్ది రోజులు ఆగలేవా అని చెప్తుంది. రాజ్ అర్థం కాక అయోమయంగా చూస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.